Best to Cook : వంటలు ఏ పాత్రల్లో వండుకుంటే మంచిదో తెలుసా?

Best to Cook

Best to Cook in pot

Best to Cook : బతకడానికి మనం రోజు ఆహారం తీసుకుంటాం. దాన్ని తయారు చేసుకునేందుకు రకరకాల పాత్రలు వినియోగిస్తుంటాం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మనకు రోగాలు రాకుండా ఉంటాయి. మనం తినే ఆహారం ఉడికించుకునే క్రమంలో కొన్ని పాత్రలు వాడాల్సి ఉంటుంది. అవి సురక్షితమైనవా కావా అనే ఆలోచన మనకు రాదు. ఏదో కొనుక్కుని వాడుతుంటాం. కానీ అందులో మంచివేవో చెడువేవో తెలుసుకుంటే మంచిది.

తాజాగా పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ కు చెందిన ప్రొపెసర్లు వంట సామగ్రిపై పరిశోధనలు చేసి కొన్ని నిజాలు వెల్లడించారు. కొన్ని పాత్రల లోహాలు ఆహారంలోకి చేరి పలు రకాల రోగాలు రావడానికి కారణంగా నిలుస్తాయి. వంట సామాన్లలో క్యాడ్మియం, నికెల్, క్రోమియం, కాపర్ ఉండటం వల్ల కిడ్నీలపై చెడు ప్రభావం చూపుతాయి.

కేన్సర్, పక్షవాతం, గుండె జబ్బులు, ఉదర సమస్యలు తలెత్తే అవకాశముంది. పిల్లల్లో కాపర్ లెవల్స్ ఎక్కువగా ఉండటం వల్ల మానసిక రోగాలు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం వంట కోసం వాడే పాత్రలు ఎలాంటివో తెలుసుకోవడం తప్పనిసరి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పాత్రలను వాడుకోవడం మంచిది.

పూర్వకాలంలో మట్టి పాత్రలు వాడేవారు. దీంతో వాటి వల్ల మనకు ఆరోగ్యం బాగుండేది. రానురాను వాటి స్థానంలో స్టీల్ పాత్రలు వచ్చాయి. స్టీల్ పాత్రలు మన ఆరోగ్యానికి అంత మంచివి కావు. మట్టి పాత్రలు వాడుకుంటేనే మన ఆరోగ్యానికి సురక్షితంగా ఉంటుంది. దీంతో ప్రస్తుతం మనం మట్టిపాత్రలు వాడటమే శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

TAGS