JAISW News Telugu

BRS : బీఆర్ఎస్ కు ఏ కంపెనీ ఎంత విరాళం ఇచ్చిందంటే..ఆ కంపెనే హయ్యెస్ట్..

BRS

BRS Party

BRS Donations : ఎలక్ట్రోరల్ బాండ్ల విరాళాలలో ప్రాంతీయ పార్టీలలో బీఆర్ఎస్ నంబర్ వన్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ బాండ్లతో దేశంలోనే టాప్ 4 పార్టీగా ఉంది. ఎన్నికల బాండ్ల రూపంలో ఆ పార్టీకి వచ్చిన మొత్తం విరాళాలు రూ.1,322 కోట్లు. ఈ ఫిగర్ చూస్తే కంపెనీలకు బీఆర్ఎస్ అంటే ఎంతో ఇష్టమో ఇట్టే తెలిసిపోతోంది. అందుకే ధారాళంగా విరాళాలు ఇచ్చేశారు. ఆయనకు వచ్చిన డబ్బంతా కాంట్రాక్టర్లు, ఐటీ కంపెనీలు, ఆస్పత్రుల నుంచి వచ్చిందని ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ తెరిస్తే తెలుస్తుంది.

ఎస్బీఐ సమర్పించిన వివరాల ప్రకారం.. బీఆర్ఎస్ ను సంపన్న పార్టీ చేసిన కంపెనీల జాబితా పెద్దదే. అందులో కొన్ని చూద్దాం..

మేఘా ఇంజినీరింగ్ : రూ.201 కోట్లు
యశోదా హాస్పిటల్స్ : 94 కోట్లు
చెన్నై గ్రీన్ వుడ్స్ : 50 కోట్లు
డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ : 32 కోట్లు
హెటిరో డ్రగ్స్ : 30 కోట్లు

ఇలా ఎన్నో కంపెనీలు కోట్లలో విరాళం ఇచ్చాయి. కేసీఆర్ పార్టీకి అందిన విరాళాల్లో సగానికిపైగా అంటే రూ.663కోట్లు(50.15శాతం) నాలుగు రోజుల్లోనే వచ్చినట్టు ఎస్బీఐ ఎన్నికల కమిషన్ కు అందించిన సమాచారంలో ఉంది. ఈ మొత్తంలో కూడా రూ.268 కోట్ల విలువైన బాండ్లు ఒకే రోజున తెలంగాణ భవన్ లో వచ్చిపడ్డాయి. తెలుగు రాజకీయ పార్టీలన్నింటికీ అత్యంత ఆప్తుడైన మేఘా కంపెనీ నుంచి కేసీఆర్ కు అందిన విరాళం ఏకంగా రూ.201 కోట్లు. ఎవరు అధికారంలో ఉన్న ఆ కంపెనీని విస్మరించడం కష్టమే.

బాండ్ల తేదీలను బట్టి చూస్తే నిరుడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే వచ్చాయని అర్థమవుతోంది. జూలై, అక్టోబర్ మధ్యనే వచ్చాయి. కేరళకు చెందిన కైటెక్స్ కంపెనీ నుంచి బీఆర్ఎస్ కు రూ.25 కోట్లు అందాయి. దీని వెనక రహస్యం ఏంటంటే..? వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో ఈ కంపెనీకి ప్రభుత్వం 187 ఎకరాల భూమిని ధారదత్తం చేసింది. ఇది జరిగిన వెంటనే విరాళం అందింది.

కాగా, అన్ని పార్టీలకు అందించిన విరాళాల్లో కంపెనీలు ఆ పార్టీలతో ఏదో రకంగా క్విడ్ ప్రొ కో అయ్యే ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార బీజేపీకి వచ్చిన విరాళాలు అన్ని పార్టీల కంటే చాలా చాలా ఎక్కువ. వీటిలో కూడా అన్నీ నీకిది..నాకది పద్ధతిలోనే ఉన్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Exit mobile version