JAISW News Telugu

YCP : అధికారంతో వచ్చింది.. ఓటమితో పోయిందా.?

ycp

YCP  : ఆట ఏదైనా గెలుపు, ఓటమి కామన్. గెలిచామని విర్రవీగడం, ఓడామని నీరుగారిపోవడం చేయద్దు. ఓడలు బండ్లవడం.. బండ్లు ఓడలవడం కాలచక్రంలో భాగమే. అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదన్న సత్యాలను గుర్తుంచుకుంటే నాయకుడు గొప్పోడు అవుతాడు. కానీ గెలిచినప్పుడు నా అంత వాడు లేడని విర్రవీగితే మాత్రం పాతాళానికి తొక్కక మానరు ప్రజలు. ఈ విషయాలను వైసీపీ నాయకులు ఇప్పటికైనా గ్రహించి ఉంటారా? అన్న సందేహం కలుగుతోంది.

గెలుపు తాలూకు విధ్వంసం, ఓటమి తాలూకు పతనం మనిషిని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకెళ్లగలదో రోజా, వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఆర్కే, పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి వంటి నాయకులను చూస్తే అర్థం అవుతోంది. ఒక్క గెలుపుతో బలుపెక్కి ఎక్కడో కూర్చున్న నాయకులు ఒక్క ఓటమితో పాతాళానికి పడిపోయారు.

అధికారంలో ఉన్నంత కాలం ప్రతిపక్ష నేతలను మీడియా ముందు నోటికచ్చిన బూతులు తిడుతూ హేళన చేస్తూ విలువైన సమయాన్ని వృథా చేసుకున్నారు. బాబు జైలుకు వెళ్తే.. పటాకలు పేల్చి పంచుకున్న రోజా నగరిలో ఘోర ఓటమి చవిచూసింది. రోజా ఓటమితో సొంత పార్టీ కార్యకర్తలే స్వీట్లు పంచుకుంటూ సంబురాలు చేసుకున్నారు.

ఒక ప్రజా ప్రతినిధిగా గౌరవంగా ఉండాల్సిన కొడాలి నాని హోదా మరిచి వాడేం పీకుతాడు.. వీడేం పీకుతాడు.. అంటూ వీధి రౌడీగా ప్రవర్తించిన తీరును ప్రజలు నిశితంగా పరిశీలించారు. విపక్ష నేతలను గౌరవంగా విమర్శించాలే గానీ ఇలాంటి పదజాలం లేంటని ప్రజలే కొడాలి పోస్ట్ ను పీకి పడేశారు.

ఎమ్మెల్యే గా ఉండగా మాచర్లలో టీడీపీ నేతలు అడుపెడితే ఎంతటి విధ్వంసం జరుగుతుందో నడిరోడ్డుపై చూపించారు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి. దీంతో ప్రజలు స్ట్రయిట్ బటన్ నొక్కి పిన్నెల్లిని సాగనంపారు. టీడీపీ నాయకులను ఈ భూమిపై లేకుండా చేద్దాం అని పిలుపునిచ్చిన పిన్నెల్లిని కనిపించకుండా చేశారు.
 
సమాజమే సిగ్గుపడేలా బాబు సతీమణి భువనేశ్వరిపై నోరు పారేసుకున్న వల్లభనేని వంశీ ఘోరంగా ఓడిపోయాడు. ఆయన ఇప్పుడు ధైర్యంగా రోడ్డు పై  తిరగలేని పరిస్థితిలో ఉన్నాడు.

ఇక కరకట్ట కమలహాసన్ (ఆర్కే) విషయానికి వస్తే.. రాష్ట్ర విభజన నాటి నుంచి అభివృద్ధికి ఎదో ఒక రకంగా అడ్డుతగులుతూనే ఉన్నారు. రాజధానిని అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డి అప్పటి సీఎం బాబుపై అనేక కేసులు వేశారు. రాజధాని పరిధిలోకి వచ్చే సొంత నియోజకవర్గం అభివృద్ధిని అడ్డుకుంటూ కులాల మధ్య చిచ్చు పెట్టారు.

తాను గెలిచించి ప్రజల కోసం కాదని, కేవలం జగన్ కోసమే అనేలా పని చేశాడు. అలా పని చేసినా 2024 ఎన్నికల్లో జగన్ ఈయన గారికి టికెట్ నిరాకరించడంతో చెల్లి షర్మిల పంచన చేరాడు. అక్కడ కూడా నిలకడ లేక మళ్లీ జగన్ చెంతకే చేరి మంగళగిరిలో లోకేష్ ను ఓడిస్తానని శపథం చేశారు. ఎన్నికల ముందు వరకు మంగళగిరికి తానే రాజు తానే మంత్రి అనుకున్న ఆర్కే ఫలితాల తర్వాత కనిపించ లేదు.

గుడివాడలో నన్ను ఢీ కొట్టే మగాడే పుట్టలేదు అంటూ కొడాలి, జగన్ మెప్పు కోసం ఎంతకైనా దిగజారగాలను అంటూ రెచ్చిపోయిన వంశీ, నగరి గడ్డ రోజా అడ్డా అంటూ రెచ్చిపోయిన నటి అధికార మదం పోయి ఓటమితో భయం విలువ తెలిసొచ్చిందని అందుకే మీడియా కంటికి కూడా కనిపించకుండా దాక్కుంటున్నారు అంటున్నాయి టీడీపీ శ్రేణులు.

Exit mobile version