Chandrababu : కార్యకర్త అయినా, నాయకుడైనా.. పార్టీనే ఆయన కుటుంబం..
Chandrababu : దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. తన మామ నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీలో సామాన్య కార్యకర్తగా పని చేయడం నుంచి మొదలు పెట్టి నేడు సీఎంగా ఎదిగారు. కేంద్ర ప్రభుత్వం నేడు నిలబడేందుకు సపోర్ట్ ఇచ్చిన నేత టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడే అంటే అతిశయోక్తి లేదు. తన పార్టీ నుంచి 16 మంది ఎంపీలను ఎన్డీయేకు సపోర్ట్ గా ఇచ్చారు. కార్యకర్త నుంచి ఎమ్మెల్యేగా అక్కడి నుంచి సీఎంగా అంచలంచెలుగా ఎదుగుతూ వస్తున్న బాబు ఎంత కష్టం వచ్చినా.. పార్టీ అధికారంలో లేని సమయంలో కార్యకర్తలను విడిచిపెట్టలేదు.
ప్రతీ కార్యకర్తను తన ఇంటి సభ్యుడిగా చూసుకుంటారు చంద్రబాబు నాయుడు. వారికి కష్టం వస్తే ముందుండి పోరాడుతారు. కార్యకర్తలు లేనిదే పార్టీ లేదని ఆయనకు ముందు నుంచి తెలుసు.. నేడు ఎంతో మంది నాయకులు ఒక్క సారి ప్రభుత్వంలో లేకపోతే కార్యకర్తలను, కేడర్ ను మరిచిపోతుంటారు. కానీ బాబు మాత్రం అలా ఎప్పుడూ చేయలేదు. అందుకే ఆయన పార్టీలోకి ఎక్కువ మంది వస్తుంటారు. టీడీపీని వీడి వెళ్లిన కార్యకర్తలు ఇతర పార్టీలతో పోల్చుకుంటే నాలుగో వంతు కూడా ఉండరంటే ఆయన వారిపై చూపే ప్రేమనే కారణం.
పార్టీలోని ఏ కార్యకర్తకు ఏమైనా జరిగిందంటే ఆయన స్థానిక నాయకుడితో వాకబు చేస్తారు. వారికి తగిన సాయం చేయాలని నాయకులను ఆదేశిస్తాడు. ఏం సాయం చేశారని ఆరా కూడా తీస్తారు. ప్రతీ ఒక్కరిపై ఆయన దృష్టి ఉంటుంది. అందుకే టీడీపీ ఎప్పుటికీ పటిష్టంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు చనిపోయిన సమయంలో చంద్రబాబు రోధించిన దాఖలాలు అనేకం ఉన్నాయి. తన బావ మరిది హరికృష్ణ, ఎర్రం నాయుడు, లాల్ జాన్ భాష, తోట చంద్రయ్య, బడేటి బుజ్జి లాంటి వారు చనిపోయినప్పడు వారి పాడెను మోసి తన అభిమానాన్ని చాటుకున్నారు చంద్రబాబు నాయుడు.