ICC : ఐసీసీ నిర్వహించిన ట్రోఫీలో ఎక్కడెక్కడ ఆయా జట్లు పాల్గొనలేదంటే?
ICC : ఐసీసీ నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్లలో ప్రతి సభ్యత్వ దేశం కచ్చితంగా పాల్గొనాల్సిందే. కానీ ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే నెలలో పాకిస్తాన్లో జరగనుంది. దీనికి బీసీసీఐ ఇండియా క్రికెట్ టీంని పంపించడం లేదని ఐసిసికి తెగేసి చెప్పింది. పాక్ లో భద్రతా కారణాల దృష్ట్యా తాము తమ జట్టుని పంపించలేదని చెప్పింది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ విషయంలో అసంతృప్తిగా ఉంది. పాకిస్తాన్లోనే కచ్చితంగా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీనిర్వహిస్తామని తేల్చి చెప్పింది.
కాగా భారత్ మాత్రం ఆడేది లేదని తటస్థ వేదికలు పెడితేనే అందులో పాల్గొంటామని స్పష్టంగా తెలియజేసింది. దీంతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉంది. గతంలో కూడా కొన్ని దేశాలు వివిధ దేశాల్లో క్రికెట్ ఆడేందుకు నిరాకరించాయి. 1996 వరల్డ్ కప్ సమయంలో భారత శ్రీలంక పాకిస్తాన్ కలిసి ఆతిథ్యం ఇచ్చాయి.
అయితే శ్రీలంకలో 14 రోజుల ముందు బాంబు పేలుళ్లు జరిగి 90 మంది చనిపోతారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు అక్కడ తాము ఆడమని చెబుతారు. తమకు రెండేసి పాయింట్లు ఇవ్వాలని కోరుతారు. దీనికి లంక జట్టు నిరాకరిస్తుంది. కాగా ఆస్ట్రేలియా జట్టు చివరికి మ్యాచ్ ఆడనందుకు లంక జట్టుకే రెండు పాయింట్లు లభిస్తాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియా తో ఫైనల్లో మ్యాచ్ గెలిచి విశ్వ విజేతగా శ్రీలంక జట్టు నిలుస్తుంది.
2003 సంవత్సరంలో కెన్యా దక్షిణాఫ్రికా జింబాబ్వే సంయుక్తంగా వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇచ్చాయి. ఈ సందర్భంలో కేన్యాలో మ్యాచ్ ఆడేందుకు న్యూజిలాండ్ జుంబాబ్వేతో మ్యాచ్ ఆడేందుకు ఆయా టీంలు నిరాకరించాయి. ఇలా మ్యాచ్ ఆడకుండానే రెండు పాయింట్లు రావడం అనూహ్యంగా అది సెమీఫైనల్ కు చేరుకోవడం అందరిని షాక్ కు గురి చేసింది.
జాతి వివక్ష వ్యాఖ్యలతో న్యూజిలాండ్ పర్యటన కు వెస్టిండీస్ జట్టు వెళ్లలేదు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న జాతి వివక్ష పోరాటంలో న్యూజిలాండ్ మద్దతు తెలపకపోవడంతో పర్యటనకు వెళ్లలేదు. భద్రతా రీత్యా ఆయా దేశాలకు మ్యాచ్లు ఆడేందుకు వెళ్లలేదు. కీలకమైన మ్యాచ్లో పాయింట్ల పోగొట్టుకొని ఇంగ్లాండ్ కూడా 2003 వరల్డ్ కప్ టైం లో గ్రూప్ దశలోనే వెను తిరగాల్సి వచ్చింది. ఇలా క్రికెట్ చరిత్రలో కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు జరిగాయి.