Car Driving : కారు డ్రైవింగ్ చేసేటప్పుడు స్టీరింగ్ పై చేతులు ఎక్కడ ఉండాలనేది కూడా చాలా ముఖ్యం. మనం డ్రైవింగ్ చేయునప్పుడు చేతులను పై వైపు లేదా క్రింది వైపు, ఇరు ప్రక్కలా స్టీరింగ్ ను పట్టుకుంటాం. అయితే అలా ఎటువైపు పడితే అటువైపు మనం కంఫర్టుగా పట్టుకున్నప్పుడు ఊహించకుండా ఆక్సిడెంట్ జరిగితే మన చేయి రెండు ముక్కలయ్యే అవకాశముంది.
ఈ వీడియోలో అదే విషయాన్ని డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి మరో వ్యక్తి వివరిస్తున్నాడు. అదేంటంటే.. డ్రైవింగ్ సమయంలో మన చేతులతో స్టీరింగ్ ను కుడి, ఎడమ వైపులకు పట్టుకుంటే మంచిది. అలా కాకుండా పై వైపునకు పట్టుకుంటే ప్రమాదం సమయంలో స్టీరింగ్ మధ్యలో ఉన్న బెలూన్ వేగంగా బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చిన బెలూన్ వేగానికి డ్రైవర్ చేయి రెండు ముక్కలవుతుంది. అందుకే డ్రైవర్ చేతులను స్టీరింగ్ పై వైపు పట్టుకోవడం మంచిదికాదు. ఇది కారు డ్రైవర్లు గుర్తు పెట్టుకోవాలి.