JAISW News Telugu

Supreme Court : కల్తీ నెయ్యిని లడ్డూలో వాడినట్లు ఆధారాలు ఎక్కడ?: సుప్రీంకోర్టు

Supreme Court

Supreme Court and Srivari Laddu

Supreme Court : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులకు సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలు సంధించింది. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నెయ్యి రిపోర్టుపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని ప్రశ్నించింది. లడ్డూ కల్తీ జరిగిందని తేల్చడం కోసం శాంపిల్ ల్యాబ్ కు పంపారా అని నిలదీసింది. ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదని అడిగింది. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించండని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

తిరుమల లడ్డూపై వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చేరిన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై నిజానిజాలను నిగ్గు తేల్చాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రమణ్యస్వామితో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో సోమవారం (సెప్టెంబరు 30) విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ బెంచ్ ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించి, వాదనలు వింది.

Exit mobile version