Ram Charan : టాలీవుడ్ లో మెగా, మంచు ఫ్యామిలీలు ఉప్పు, నిప్పుగా ఉంటాయని గాసిప్ ఉంది. ఇటు చిరంజీవి, అంటు మోహన్ బాబు మధ్య ఏదో ఒక వివాదం ఉండనే ఉంటుందన్న అపవాదు ఉందనే ఉంది. కానీ, వారి కుమారులు మాత్రం మంచి ఫ్రెండ్స్ అని ఇండస్ట్రీ మొత్తం తెలుసు. మెగా, మంచు మధ్యలో ఉంది కూడా వృత్తి పరమైన వైరం తప్పితే పెద్ద శత్రుత్వం ఏదీ కాదు. మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్, చిరు కుమారుడు రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇది మధ్య మంచి బాండింగ్ ఉంది. ఆ బాండింగ్ గురించి మనోజ్ కొన్ని నిజాలను బయటపెట్టాడు.
రామ్ చరణ్ పుట్టిన రోజు మార్చి 27వ తేదీ జరిగింది. అదే రోజు ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ గురించి టాలీవుడ్ లోని సెలబ్రెటీలు, హీరోలు, దర్శకులు, నిర్మాతలు మాట్లాడారు. మంచు మనోజ్ మాట్లాడుతూ.. రామ్ చరణ్, రెండు ఫ్యామిలీల మధ్య రిలేషన్ గురించి ప్రస్తావించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
‘ఇక్కడకు రావడం హ్యాపీగా ఉంది. ప్రాణ స్నేహితుడు రామ్ చరణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. చెర్రీ గురించి చెప్పాలంటే.. బాల్యంలో మేమంతా చెన్నైలో ఉండేవాళ్లం. అందరం కలిగే పెరిగాం. అప్పటి నుంచి చరణ్‌కు ఓ మంచి గుణం ఉంది. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆయన చూడలేడు. నిజంగా అది ఈ రోజుల్లో ఎవరికీ ఉండదు. ఎంత గొప్ప నటుడో.. అంత కంటే గొప్ప మనిషి కూడా. ఈవెంట్ కు నాన్ను పిలవగానే రావడానికి కారణం ఇదే. స్నేహితుడిగా మాట్లాడడం నా బాధ్యత. ఈ రోజుల్లో విలువైనది స్నేహం. మనిషి ఎదిగే కొద్దీ.. కొత్త పరిచయాలు వస్తుంటాయి. పాత పరిచయాలు పోతుంటాయి. కానీ చెర్రీ చరణ్ అలా కాదు’ అని ఎమోషనల్ అయ్యాడు.
‘2018 అమెరికాలో ఉన్న సమయం దుబాయ్‌లో ఒక తెలుగు ఫ్యామిలీకి కష్టం వచ్చింది. వాళ్లది ఇమ్మిగ్రేషన్ సమస్య, వారిలో ఒక ఆడపిల్ల కూడా ఉంది. సిగ్నేచర్లు పెట్టించుకొని, పాస్ పోర్టులు తీసుకొని, కుటుంబాన్ని లాక్ చేశారు. ఆ సమయంలో వాళ్లకు డబ్బు అవసరం వచ్చింది. నాకు ఫోన్లు రావడంతో నేను సాయం చేశా. అప్పుడు నా దగ్గర కూడా టైట్. అర్థరాత్రి అయ్యింది ఎవరికి చేయాలో తెలియక చరణ్‌కు ఫోన్ చేసి పరిస్థితి చెప్పా. నా వంతు సాయం అందించాను.. అర్జంటుగా రూ. 5 లక్షలు కావాలి. తక్కువయ్యాయి రా.. ఎలా చేయాలని అడగ్గా.. అకౌంట్ నెంబర్ పెట్టు బాబాయ్ అని నిమిషంలో పంపాడు.’ చరణ్ ను ఆశీర్వదిస్తూ.. నిజంగా బాబాయ్ (చరణ్) పాప తల్లిదండ్రుల ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఉంటాయి. నువ్వు చల్లగా ఉంటావు. నీకే కష్టం రాకుండా వరల్డ్ వైడ్ నెం.1 స్టార్ అయిపోవాలి’ అని దేవున్ని ప్రార్ధిస్తున్నట్లు చెప్పాడు.
#ManchuManoj mentions #RamCharan, Mega Family & #PawanKalyan in RC birthday event pic.twitter.com/qSxEsvJUpw
— BigBoss Telugu Views (@BBTeluguViews) March 28, 2024