
Pawan Kalyan
Pawan Kalyan : జనసేన నుండి బయటకు వచ్చిన పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కు డబ్బు ఎక్కడి నుండి వస్తుందని ప్రశ్నించారు. 2014 నుండి పవన్ కనీసం ఆరు సినిమాలు కూడా చేయలేదని.. అందులో ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయి.. ఎన్ని ప్లాప్ అయ్యాయనే విషయం అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. ఈ సినిమాలకు పవన్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత, పార్టీ కోసం ఆయన ఖర్చు చేసింది ఎంత, కొన్న ఆస్తుల విలువ ఎంత అనే విషయాలు ప్రజలందరికీ తెలియాల్సి ఉందని అన్నారు. ఈ వివరాలన్నీ త్వరలోనే బయట పెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు మహేష్.
కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్ గృహ ప్రవేశం గురించి కూడా మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కొత్త ఇల్లు గృహ ప్రవేశం చేస్తున్నారు.. సంతోషం.. ఈ పూజకి అన్నా లెజ్నెవా గారితో హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మహేష్ వ్యాఖ్యలు చేసాడు.