New Jobs : ఏపీలో కొత్తగా ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి సారూ?

New Jobs

New Jobs in Andhra, CM Jagan

New Jobs in Andhra : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. మరో రెండు నెలల్లో ఎన్నికలు రానున్నాయి. దీంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తున్నారు. సచివాలయంలో 1.67 వేల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. తాజాగా గ్రూప్ -1, గ్రూప్ -2 నోటిఫికేషన్లు వెలువడ్డాయి. కొత్త ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నందున ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టే అవకాశముంది. దీని ప్రభావం ఉద్యోగాల భర్తీపై పడనుంది. ఈ క్రమంలో అన్ని శాఖలకు ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు వెలువరించింది. కొత్తగా ఉద్యోగాల భర్తీ చేపట్టరాదని సూచించినా ప్రభుత్వం ఎందుకు నోటిఫికేషన్లు వేస్తోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏ ప్రభుత్వ శాఖలో కూడా కొత్త ఉద్యోగాల కోసం ప్రతిపాదనలు పంపొద్దని సూచించింది. ప్రస్తుతం ఉన్న పోస్టుల్లో ప్రమోషన్లు కూడా ఇవ్వొద్దని చెబుతోంది. కొత్తగా పోస్టులు వేయొద్దని తెలిపింది. కానీ ప్రభుత్వం మాత్రం వినడం లేదు. కొత్తగా ఉద్యోగాల కల్పనకు నోటిఫికేషన్లు విడుదల చేస్తూ నిరుద్యోగులతో చెలగాటమాడాలని చూస్తోందనే విమర్శలు రావడం గమనార్హం.

అంగన్ వాడీలతో పాటు పలు రంగాలకు చెందిన ఉద్యోగులు తమ వేతనాలు పెంచాలని ఆందోళన చేసినా ఇప్పుడు ఏం చేయలేమని ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు ఎక్కడ నుంచి తెస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. కొత్త ఉద్యోగాల భర్తీ, ఉద్యోగుల క్రమబద్ధీకరణ లాంటి ప్రక్రియలు చేపట్టడం సురక్షితం కాదని చెబుతోంది. ఓటాన్ అకౌంట్ ప్రభావం పడుతుందని అందరు విచారం వ్యక్తం చేస్తున్నారు.

TAGS