MP Raghunandan Rao : కేంద్రం నిధులు ఎక్కడికి పోతున్నాయి?: ఎంపీ రఘునందన్ రావు
MP Raghunandan Rao : గ్రామ పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.1200 కోట్ల నిధులు విడుదల చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.200 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. మిగిలిన రూ.1000 కోట్ల నిధులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇతర కార్యకలాపాలకు దారి మళ్లించిందని ఆరోపించారు. గ్రామ పంచాయతీల్లో విద్యుత్ బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఉందన్న రఘునందన్, పల్లె ప్రగతికి నిధులు వెచ్చించడం లేదని దుయ్యబట్టారు. పంచాయతీ కార్యదర్శులు సొంతంగా శానిటైజేషన్ కోసం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారని తెలిపారు.