Trivikram Srinivas : ఏంటి గురువు గారు మీరెప్పుడు పాన్ ఇండియా సినిమా తీస్తారు!

Trivikram Srinivas

Trivikram Srinivas

Trivikram Srinivas :  ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలకు చెందిన టాప్ డైరెక్టర్లు అంతా పాన్ ఇండియా లెవల్లో సినిమాలు తీస్తూ దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వారిని నమ్మి నిర్మాతలు కూడా వందల కోట్లు కుమ్మరిస్తున్నారు.  అన్ని ఇండస్ట్రీలను కవర్ చేసేలా భారీ బడ్జెట్ తో సినిమాలను తలకెత్తుకుంటున్నారు. జాతీయ స్ధాయిలో పేరు, అవార్డులు అందుకుంటూ పేరు తెచ్చుకుంటున్నారు.  టాప్ లైన్ లో ఉన్న వారంతా ఈ రేంజ్ కు మెల్లగా వెళ్లిపోయారు.. వెళ్లిపోతున్నారు. ఒక్క గురూజీ తప్ప.

ఆయనో ఫ్యామిలీ డైరెక్టర్. ఆయన తీస్తున్న సినిమాల కథలన్నీ   కుటుంబాల చుట్టూ తిరుగుతుంటాయి. తిరిగిన కథలే మళ్లీ మళ్లీ తిరుగుతుంటాయి. అరవింద సమేత సినిమా ఒక్కటి  మినహాయింపు. ఈ తరహా కథలతో పాన్ ఇండియా లెవెల్ కు వెళ్లడం అంటే కష్టం.  పైగా డైలాగ్ బేస్డ్ ఫన్, ఫ్యామిలీ బేస్డ్ ఎమోషన్లు పాన్ ఇండియా లెవెల్ కు సరిపోవు. పాన్ ఇండియా సినిమా అంటే పెద్ద కాన్వాస్, అవుటాఫ్ ది బాక్స్ ఐడియాలు, ఇలా చాలా కావాలి. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్లకు హిందీ బెల్ట్ లో వచ్చే ఇమేజ్ వేరు. అది సాధించాలంటే పౌరాణికాలు సరిపోవు. భారతమో, రామాయణమో, భక్త ప్రహ్లాదనో తీసుకోవాలి. అలాంటి కథలు తీసుకున్నా భారీ లెవెల్లో తీసి పాన్ ఇండియాకు వెళ్దామని అనుకున్నా, రాంగ్ ఐడియానే అవుతుంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ ఇలాంటి ప్రయత్నం బన్నీ కోసం చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.   పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో కనుక సినిమా చేస్తే అది కచ్చితంగా పాన్ ఇండియా  రేంజ్ సినిమా అవుతుంది. అప్పుడు కానీ టాప్ డైరక్టర్లలో మిగిలిన త్రివిక్రమ్ కూడా పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లడం సాధ్యం కాదు. అందువల్ల సరైన అడుగు వేస్తే తప్ప, త్రివిక్రమ్ పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లలేరు.

TAGS