JAISW News Telugu

Pawan Kalyan Movie : పవన్ కల్యాణ్ సినిమా చూసేందుకు ప్రధాని మోదీ రాక ఎప్పుడంటే? 

Pawan Kalyan Movie

Pawan Kalyan Movie

Pawan Kalyan movie : పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు చిత్ర నిర్మాత ఏఎస్ రత్నం విడుదలకు ముందే పెద్ద ప్లాన్ వేశాడు. దీంతో ఆ సినిమా పాన్ ఇండియా లెవల్లో భారీ హిట్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో స్వాతంత్య్ర సంగ్రామ పోరాటంలో పాల్గొన్న ఒక వీరుడి పాత్రలో కనిపించనున్నాడు.
ఈ మూవీని 2025 మార్చి 28న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో పవన్ కల్యాణ్ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ పూర్తి కాగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటూ ఈ ఫిల్మ్ మేకర్స్ ముందుకు సాగనున్నారు. నిర్మాత రత్నం వేసిన ప్లాన్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫిల్మ్ మేకర్స్ కు దిమ్మ తిరిగి పోతుంది.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ప్రీమియర్ షోకు హాజరయ్యేలా ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా  దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఒక దేశ భక్తుడు పోరాడిన విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపించనున్నట్లు సమాచారం. ఒక వేళ ప్రధాని మోదీ సినిమాకు హాజరై దాని గురించి నాలుగు మాట్లాడితే చాలు.. బాలీవుడ్, టాలీవుడ్ అనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. దీంతో ఎక్కడ లేని ప్రచారం వస్తుంది. బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలికో క్యూ మారా అని ప్రధాని అనడంతో సినిమా గురించి మరింత ప్రచారం ఫ్రీగా దొరికనట్లయింది.
 పవన్ కల్యాణ్ ఎలాగో బీజేపీతో పొత్తులో ఉన్నాడు. కాబట్టి ప్రధాని మోదీ గనక ప్రీమియర్ షోకు వచ్చి రెండు ముక్కలు మాట్లాడాడంటే చాలు.. ఇక సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం ఖాయం. ఇలా ఏకంగా ప్రధానిని రప్పించేందుకు హరిహర వీరమల్లు నిర్మాత ఏఎస్ రత్నం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Exit mobile version