JAISW News Telugu

Vande Bharat : వందే భారత్ స్లీపర్ రైలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందంటే

Vande Bharat

Vande Bharat

Vande Bharat Trains : భారత రైల్వే వ్యవస్థలోకి సరికొత్తగా వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రానుంది . కేంద్ర ప్రభుత్వం ఈ స్లీపర్ రైళ్లను అతి త్వరలో ప్రవేశపెట్టబోతున్నాయి. వందే భారత్ స్లీపర్ రైలు ప్రవేశంతో భారతీయ రైల్వే వ్యవస్థ తొక్కనుంది. ఈ రైలు ప్రత్యేకత ఏమిటంటే రీడింగ్ లైట్స్ ఉంటుంటాయి. నూతన అధునాతన టెక్నాలజీతో పబ్లిక్ అనౌన్స్మెంట్ చేస్తారు. సెక్యూరిటీ, ఇన్సైడ్ డిస్ప్లే లు దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన సీట్లు, అధునాతన టాయిలెట్స్ దీని ప్రత్యేకత. అంతేకాకుండా ఫస్ట్ ఏసీ కోచ్ లో హాట్ వాటర్ తో స్నానం చేసే సౌకర్యం కూడా కల్పించారు.

ఇంతటి అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న స్లీపర్ రైలు అతి త్వరలో ఇండియాలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఈ రైలు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఒకేసారి 823 మంది ప్రయాణికులతో జర్నీ చేయగల సామర్థ్యం స్లీపర్ రైలు రైలుకు ఉంది. ఈ రైలులో 3 ఏసి టూ ఏసీ వన్ ఏసి కోచ్ లు ఉన్నాయి. పైలెట్, లోకో పైలట్ తో సహా ప్రతిష్టమైన భద్రతా సిబ్బంది ఈ రైల్లో భద్రత చేపట్టనున్నారు.

అయితే ఈ వందే భారత స్లీపర్ రైలుకు నార్మల్ స్లీపర్ రైళ్ల లాగానే టికెట్ ధరలు ఉంటాయని కేంద్ర మంత్రి ప్రకటించారు. వందే భారత్ స్లీపర్ రైలు తీసుకురావడం వెనుక టికెట్ల రేట్లు పెంచి ఇలా చేస్తున్నారని చాలామంది అనుమానాలు వ్యక్తం చేయగా అలాంటివి ఏమీ లేవని గతంలో ఉన్న స్లీపర్ రైలు మీద రైలుకు టికెట్ ధర ఎంత ఉండేదో దీనికి కూడా అంతే ఉంటుందని అన్నారు. అయితే ఈ వందే భారత్ స్లీపర్ రైలు రెండు నెలల్లోనే ప్రారంభం కావచ్చని అనుకుంటున్నారు. బెంగళూరు, ముంబయి,  ఢిల్లీ లాంటి ప్రధాన నగరాలు ఎక్కడి నుంచైనా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు చర్చలు జరుగుతున్నాయి.

Exit mobile version