నాగ చైతన్య, శోభిత పెళ్లెప్పుడు.. నాగార్జున రిప్లై ఇదే

Naga Chaitanya and Sobhita

Naga Chaitanya and Sobhita

Naga Chaitanya and Sobhita Marriage : స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం గురువారం హైదరాబాద్‌లో సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. అయితే తాజాగా తన కొడుకు నిశ్చితార్థం గురించి హీరో అక్కినేని నాగార్జున ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడారు. నిశ్చితార్థం పట్ల వారంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఈ సంద‌ర్భంగా నాగ్ త‌మ వారి పెళ్లి గురించి చెప్పుకొచ్చాడు.  విడాకుల తర్వాత చైతన్య చాలా బాధపడ్డాడని చెప్పాడు. ఆ బాధను ఎవరితోనూ పంచుకోలేదన్నారు. తన కొడుకును మళ్లీ సంతోషంగా చూడడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వారి తరపున నాగ్ మాట్లాడారు. పెళ్లికి కొంత సమయం పడుతుందని నాగార్జున ఈ సందర్భంగా వెల్లడించారు. ఎంగేజ్‌మెంట్‌ చేసుకోవాలని వాళ్లిద్దరూ అప్పటికప్పుడు అనుకున్నారు. దీంతో వెంటనే చేసేశాం. పెళ్లికి మాత్రం అలా కాదు. ప్రస్తుతం ఇద్దరూ వారి కెరీర్స్‌తో బిజీగా ఉన్నారు. దానికి చాలా టైమ్ పడుతుందన్నారు.

నిశ్చితార్థానికి అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘నా కొడుకు నాగ చైతన్య, శోభిత ధూళిపాళల నిశ్చితార్థం గురువారం ఉదయం 9.42 గంటలకు జరిగింది. దీన్ని మీ అందరితో పంచుకున్నందుకు సంతోషంగా ఉంది. మేము ఆమెను మా కుటుంబంలోకి సంతోషంగా స్వాగతిస్తున్నాము. నూతన వధూవరులకు నా అభినందనలు. వారి జీవితాలు ఆనందం,  ప్రేమతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను. 8.8.8 (08-08-2024) అనంతమైన ప్రేమకు నాంది’ అని నాగార్జున అన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

నాగ చైతన్య గతంలో నటి సమంతను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. చై-శోభిత ఎప్పటి నుంచో స్నేహితులు. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విజేతగా నిలిచిన శోభిత ధూళిపాళ్ల.. 2016లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి.. ‘గూఢచారి’తో తెలుగు తెరకు పరిచయమైంది. ‘మేజర్’, ‘పొన్నియన్ సెల్వన్’, ‘మంకీ మ్యాన్’ వంటి ప్రాజెక్టుల్లో పనిచేశారు. మరోవైపు నాగ చైతన్య ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు.

TAGS