Collector Harichandana : కలెక్టర్ హరిచందనపై వాట్సాప్ లో పోస్టింగ్స్..వైరల్ గా మారిన పోస్టులు
Collector Harichandana : నల్లగొండ జిల్లా కలెక్టర్ హరిచందనపై వాట్సాప్ లో పెట్టిన పోస్టులు కలకలం సృష్టిస్తున్నాయి. ఆమె వైఖరిని నిలదీస్తూ పలువురు కాంట్రాక్టర్లు పోస్టులు పెట్టారు. బిల్లులు చేయకపోతే తామంతా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో చిన్న కాంట్రాక్టర్లు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనులు చేశారు. ఆ సమయంలో బయట అప్పులు చేసి కొందరు, ఆస్తులు తనఖా పెట్టి మరి కొందరు అభివృద్ధి పనులను పూర్తి చేశారు. ఇలా ఒక్కొక్కరు లక్ష రూపాయలు మొదలుకొని కోటి రూపాయల వరకు పనులు చేశారు. కానీ వారికి గత ప్రభుత్వం సకాలంలో బిల్లులు చేశారు. కానీ వారికి గత ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించలేదు. ఈలోపు అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఎక్కడి బిల్లులు అక్కడ ఆగిపోయాయి.
డిసెంబర్ నుంచి మార్చి వరకు కాంట్రాక్టర్లు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన ఏ ఒక్క చెక్కు రిలీజ్ కాలేదు. కలెక్టర్ చుట్టు ఎన్నిసార్లు తిరిగినా ఆమె పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. తాజా మళ్లీ ఎలక్షన్లు రావడం.. మరో మూడు నెలల వరకు కోడ్ అమల్లో ఉంటుండడంతో చోటా కాంట్రాక్టర్లలో ఆగ్రహం పెరిగిపోయింది. ఈ క్రమంలో కలెక్టర్ తీరును నిరసిస్తూ వాట్సాప్ లో పోస్టులు పెట్టారు. ‘మూడు నెలల నుంచి చెక్కులు రాక ఇబ్బందులు పడుతున్నాం. మా పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. ఎన్నికల పేరుతో మరో రెండు నెలలు మీరు చెక్కులు జారీ చేయకపోతే మేము అందరం రోడ్లపై పడే పరిస్థితి ఉన్నది. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించింది. దయచేసి ఎన్నికల కోడ్ తో సంబంధం లేకుండా మా చెక్కులు రిలీజ్ చేయాలి’’ అని పోస్టులు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టులు వాట్సాప్ లో వైరల్ గా మారాయి. కలెక్టర్ తీరుపై కొందరు కాంట్రాక్టర్లు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.