WhatsApp డౌన్..!
WhatsApp down : వాట్సాప్ సేవల్లో అంతరాయం కలుగుతోందని పలువురు యూజర్లు Xలో పోస్టులు చేస్తున్నారు. మెసేజులు సెండ్ కావట్లేదని, స్టేటస్‌లు అప్డేట్ అవ్వట్లేదని చెబుతున్నారు. అసలు వాట్సాప్ లాగిన్ కావడం లేదని మరికొందరు పేర్కొంటున్నారు. కాగా మన దేశంలో ఎక్కువ మంది వినియోగించే యూపీఐ, వాట్సాప్ సేవలు ఒకేరోజు డౌన్ కావడం గమనార్హం.