Actress Sadha : నటి సదా పెళ్లి, విడాకుల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆమె ఈ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిపై తనకు ఇంట్రస్ట్ లేదని? అలా ఎలా కలిసి ఉంటారో తనకు అర్థం కాదని, విడాకులు తీసుకుంటే తప్పేంటి అంటూ ప్రశ్నించారు సదా. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
‘జయం’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సదా ఆ తరువాత కూడా వరుసగా సినిమాలు చేశారు. కానీ, అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయారు. దాంతో కొంతకాలం నటనకు గ్యాప్ ఇచ్చిన ఆమె.. టీవీ షోలలో జడ్జ్ గా సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశారు. అయితే, ఆమె ఇప్పటికీ సింగల్ గానే ఉన్నారు. పెళ్లి గురించి ఎప్పటికప్పుడు మాట దాటేస్తూ వచ్చిన ఆమె తాజాగా ఆ విషయంపై నోరు విప్పారు.
‘‘ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్నాను. నాకు నచ్చిన పని చేసుకుంటున్నాను. ఈ ఫ్రీడమ్ ను నేను పోగొట్టుకోవాలనుకోవడం లేదు. ఇప్పటి వరకు నాకు నచ్చిన వ్యక్తి దొరకలేదు. అందుకే పెళ్లి చేసుకోవాలనే ఫీలింగ్ కలుగలేదు. పెళ్లి చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటాను. పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్ సాగడం కష్టంగా ఉందని భావిస్తే.. పార్టనర్ తో జర్నీ కష్టంగా అనిపిస్తే.. భరించలేకపోతే విడాకులు తీసుకోవడంలో తప్పులేదు’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు సదా.