JAISW News Telugu

OTT Movies : ఈ వారం థియేటర్‌, ఓటీటీలో ఏమున్నాయంటే?

OTT Movies

OTT Movies

OTT Movies : ఒక వైపు ఐపీఎల్, మరో వైపు ఎలక్షన్స్ వీటితో పెద్ద సినిమాలు లేవు. కేవలం చిన్న సినిమాలు మాత్రమే కొంత ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చాయి. ఈ వారం కూడా చిన్న సినిమాలే థియేటర్, ఓటీటీలోకి రానున్నాయి. ఏయే సినిమాలు రాబోతున్నాయో తెలుసుకుందాం.

మహారాజ..
విజయ్‌ సేతుపతి లీడ్ రోల్ లో కనిపించే క్రైం, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘మహారాజ’ థియేటర్లలోకి రాబోతోంది. ఈ మూవీకి నిథిలన్‌ దర్శకుడు. అనురాగ్‌ కశ్యప్‌, మమత, అభిరామి నటిస్తున్నారు. చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ‘మహారాజ’ (శుక్రవారం) జూన్‌ 14న థియేటర్స్‌లోకి రానుంది. అన్ని భాషల్లోని ప్రేక్షకులకు నచ్చే భావోద్వేగాలున్న సినిమా ఇదని, విజయ్‌ సేతుపతి అంటున్నారు.

హరోంహర..
సుధీర్‌బాబు కథానాయకుడిగా జ్ఞాన సాగర్‌ ద్వారక దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘హరోంహర’. చిత్తూరు జిల్లా కుప్పంలోని 1989 నాటి పరిస్థితుల నేపథ్యంలో రూపొందిన యాక్షన్‌ ఫిలిం. సునీల్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని సుమంత్‌ జీ నాయుడు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. జూన్‌ 14 (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది.

రాజధాని..
‘కేజీఎఫ్‌’తో హీరో యష్ హీరోగా చేసిన కన్నడ సినిమా రాజధాని తెలుగులో డబ్ చేశారు. సినిమా టైటిల్ మార్చి ‘రాజధాని రౌడీ’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 14 (శుక్రవారం)వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో యష్ కు జోడీగా షీనా నటించింది.

యానియా భరద్వాజ్‌ లీడ్ రోల్స్ లో కనిపించి స్టీఫెన్‌ తెరకెక్కిస్తున్న సూపర్‌   గర్ల్‌ సినిమా ‘ఇంద్రాణి’. కబీర్‌ దుహాన్‌ సింగ్‌ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా జూన్‌ 14 (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘భారతీయ సినీ చరిత్రలోనే మహిళలు రోప్‌ షాట్స్‌, రిస్క్‌ షాట్లను ఉపయోగించి చేసిన తొలి చిత్రమిది. వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌కు కీలక ప్రాధాన్యం ఇచ్చాం’ అని చిత్ర బృందం తెలిపింది.

చాందినీ చౌదరి, వశిష్ట సింహా, భరత్‌ రాజ్, అషురెడ్డి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘యేవమ్‌’. ఈ సినిమాకి ప్రకాశ్‌ దంతులూరి దర్శకత్వం వహించారు. నవదీప్, పవన్‌ గోపరాజు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. జూన్‌ 14 (శుక్రవారం) ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మహిళా సాధికారితని చాటి చెప్పే సినిమా ఇది. ప్రతీ పాత్ర అర్థవంతంగా, నూతనంగా ఉంటుంది. విభిన్నమైన కథ, కథనాలు సినిమాకు ప్రధాన ఆకర్షణ’ అని చిత్ర బృందం తెలిపింది. నేరం చుట్టూ సాగే ఈ చిత్రంలో దేవిప్రసాద్, గోపరాజు రమణ, కల్పిత తదితరులు నటించారు.

అజయ్‌ ఘోష్‌, చాందినీ చౌదరి కలిసి నటించిన చిత్రం ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’. ఈ మూవీకి శివ పాలడుగు దర్శకత్వం వహించారు. హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాతలుగా వ్యవహరించారు. 20 ఏళ్ల వయస్సులో కన్న కలలను 50 ఏళ్లలో తీర్చుకున్న వ్యక్తి మూర్తి చుట్టూ కథ తిరుగుతుంది. ఆ లక్ష్యాన్ని సాధించాడా? అనే అంశాలతో ఈ చిత్రం రూపొందించారు. జూన్‌ 14 (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓటీటీలో అలరించే చిత్రాలు/సిరీస్‌లు..

నెట్‌ఫ్లిక్స్‌..
గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి-జూన్‌ 14
మిస్టరీస్‌ ఆఫ్‌ ది టెర్రకోట వారియర్స్‌ (హలీవుడ్‌)-జూన్‌ 12
బ్రిడ్జ్‌టన్‌ (వెబ్‌సిరీస్‌)-జూన్‌ 13
మహరాజ్‌ (హిందీ)-జూన్‌ 14

అమెజాన్‌ ప్రైమ్‌..
ది బాయ్స్‌ 4 (వెబ్‌ సిరీస్‌)-జూన్‌ 13

జీ5..
పరువు (తెలుగు)-జూన్‌ 14
లవ్‌ కీ అరెంజ్‌ మ్యారేజ్‌ (హిందీ)-జూన్‌ 14

డిస్నీ+హాట్‌స్టార్‌..
ప్రొటెక్టింగ్‌ ప్యారడైజ్‌ (డాక్యుమెంటరీ)-జూన్‌ 10
నాట్‌ డెడ్‌ యెట్‌ (వెబ్‌ సిరీస్‌)-జూన్‌ 12

ఆహా..
పారిజాత పర్వం (తెలుగు)-జూన్‌ 12

బుక్‌ మై షో..
ది ఫాల్‌ గై (హాలీవుడ్‌)-జూన్‌ 14

జియో సినిమా..
గాంత్‌ (హిందీ)-జూన్‌ 11

ఆపిల్‌ టీవీ ప్లస్‌..
ప్రిజ్యూమ్‌డ్ ఇన్నోసెంట్‌ (వెబ్‌ సిరీస్‌)-జూన్‌ 12.

Exit mobile version