JAISW News Telugu

KTR : కార్యకర్తలను కేసుల పాలు చేసి కేటీఆర్ సాధించేది ఏంటి ?

KTR

KTR

KTR : ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన సెంటిమెంట్ తో టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీని అందలం ఎక్కించారు తెలంగాణ ప్రజలు. పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని పాలించారు కేసీఆర్. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్ పై అసంతృప్తి చెందిన ప్రజలు మళ్లీ కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టారు. అప్పటి నుంచి రేవంత్ సర్కారును కూల్చే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఎలాగైనా అధికార పార్టీ పై వ్యతిరేకతను తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దే దించాలన్న అతృతలో  బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఫేక్ ప్రచారాన్ని నమ్ముకుంది. ప్రతి విషయానికి సీఎం రేవంత్ రెడ్డితో ముడి పెట్టడం.. తెలంగాణకు ఏదో అయిపోయిదన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇది చూస్తున్న ప్రజలకు చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.   చివరికి ఓ యువతీ యువకుడు బీర్లు తాగుతూ రోడ్డు మీద సంచరిస్తుంటే.. దాన్ని కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ ప్రభుత్వ పనితీరుకు ముడిపెట్టేశారు. అధికారం కోల్పోవడంతో రోజు రోజుకు ఆ పార్టీ నేతల్లో అసహం ఎక్కువవుతున్నట్లు అనిపిస్తోంది. ఫేక్ పోస్టులతో రోజూ ప్రభుత్వంపై విరుచుకుపడడమే పనిగా పెట్టుకున్నారు.  

రాను రాను ఇది మరీ ఘోరంగా మారడంతో రేవంత్ రెడ్డి పోలీసులకు సీరియస్ గా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కువ చేసిన వాళ్ల పై కేసులు పెట్టి అరెస్టు చేయాలన్నారు. దాంతో పదుల సంఖ్యలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. దీనిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..  గతంలో మీరు చేయలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్ని ప్రస్తావిస్తూ బారెడు ట్వీట్లు పెట్టారు. అలా చేసినందుకు అరెస్టు చేయవద్దా అని కూడా ప్రశ్నించారు. నిజానికి ఫేక్ ప్రచారాలు చేశారని.. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారని వారు అధికారంలో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డిని చాలాసార్లు అరెస్టు చేశారు.

జన్వాడ ఫామ్ హౌస్ వివరాలు బయట పెట్టినప్పుడు అరెస్ట్ చేసి చాలా రోజులు జైలుకే పరిమితం చేశారు.  అయితే రాజకీయ ఆరోపణలు చేయడానికి ప్రభుత్వంపై ఫేక్ న్యూస్ లతో విరుచుకుపడడానికి చాలా తేడా ఉంటుంది. ప్రభుత్వంపై పోరాటం పేరుతో ఫేక్ ప్రచారంతో విరుచుకుపడితే అధినేత మాట పక్కన పెడితే ఆ పార్టీ క్యాడర్ కేసుల్లో ఇరుక్కోవడం తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇలాంటి పనులు చేసుకుంటూ పోతే   ప్రజల నుంచి సానుభూతి కూడా రావడం కష్టం.

Exit mobile version