April 2nd : ఏప్రిల్ 2న ఏం జరగనుంది?

April 2nd : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2న తీసుకోనున్న ఒక నిర్ణయంపై భారత్ ఆందోళన చెందుతోంది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న మందులపై 25% టారిఫ్ విధిస్తామని ఆయన ప్రకటించారు. దీనిపై బుధవారం తుది నిర్ణయం వెలువడనుంది. భారత్ ఏటా 30 బిలియన్ డాలర్ల విలువైన మందులను విక్రయిస్తుండగా, అందులో మూడింట ఒక వంతు అమెరికాకే ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం భారతీయ ఎగుమతులపై అమెరికాలో పెద్దగా సుంకాలు లేనప్పటికీ, భారత్ మాత్రం అమెరికా నుంచి వస్తున్న ఉత్పత్తులపై 10% సుంకం వసూలు చేస్తోంది.

TAGS