KCR : కేసీఆర్ ఇలా మారాడేంటి..!
KCR : పదవిలో ఉన్న సమయంలో తన వెనుక బలం, బలగం ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పే మాటలు, స్పీచ్ చాలా మందిని ఆకట్టుున్నాయి. కానీ ఆయన పదవి, ప్రభుత్వం కోల్పోయాక.. పార్టీ ఉనికే ప్రమాదంలో పడిందని అంచనాలు వస్తున్న సమయంలో కూడా కేసీఆర్ రెటింపు వ్యాఖ్యలు చేస్తుండడం చూస్తే సీన్ లాఫింగ్ స్టాక్ గా కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఓటర్లను ఎక్కువ లోక్ సభ సీట్లు అడగడంలో ఎలాంటి తప్పు లేదు.. కానీ ఆ సీట్లతో తాను కేంద్రంలో చక్రం తిప్పుతానని.. ప్రధాని అవుతానని చెబుతుండడమే రాజకీయ వర్గాలను నవ్వుకునేలా చేస్తోంది.
పరిస్థితులను అర్థం చేసుకొని దానికి తగ్గట్లుగా రాజకీయం చేయడం నేతల కనీస లక్షణం. అధికారంలో ఉన్న వారు కామన్ గానే తాము అందరి కంటే ఎక్కువ అనుకుంటూ ఉంటారు. అదే వారి పతనానికి కారణం అవుతుంది. ఓడిపోయిన తర్వాత కూడా దాన్ని దింపుకోలేనివారు మళ్లీ కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. కేసీఆర్ మాటలు చూస్తూంటే.. తాను తగ్గేది లేదన్న భావనలో ఉన్నారని.. ఈ అహంకారాన్ని ప్రజలు అంగీకరించబోరన్న అభిప్రాయం వినిపిస్తుంది.
స్థానికంగానే బీఆర్ఎస్ పరిస్థితి ఘోరంగా ఉంటే.. దేశ రాజకీయాల్లో తాము చక్రం తిప్పుతామని మాట్లాడుతున్నారు కేసీఆర్. దేశ ప్రజలంతా తన వెంటే ఉన్నారని తనకు వస్తాయని అనుకుంటున్న ఒకటి, రెండు సీట్లతోనే ఏదో జరిగిపోతుందని అనుకుంటున్నారు. పొరుగు రాష్ట్రాల రాజకీయాలపై సమాచారం ఉందన్నట్లుగా మాట్లాడుతున్నారు. అలాంటి సమాచారాలతో కేసీఆర్ తక్కువ స్థాయికి పడిపోయారు. ఇప్పుడు ఆయన చేస్తున్న రాజకీయం ఎలా ఉందంటే నాన్ సీరియస్ పొలిటీషియన్ గా మారిపోయింది. జూన్ 4వ తేదీ తర్వాత ఆయన మరింత గడ్డు పరిస్థితి ఎదుర్కోబోతున్నారు. ఇదే రాజకీయం కొనసాగిస్తే.. బీఆర్ఎస్ క్యాడర్ కూడా పెదవి విరవాల్సి వస్తుందేమో..