JAISW News Telugu

Megastar Chiranjeevi : ‘కల్కి’ విషయంలో మెగాస్టార్ తీసుకున్న నిర్ణయం ఏంటి? చిరంజీవి జడ్జిమెంట్ కరెక్టేనా?

Megastar Chiranjeevi

Megastar Chiranjeevi

Megastar Chiranjeevi : ప్రస్తుతం ఇండియన్ సినిమా  కల్కి 2898 AD చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్నది. ఇక ఈ సినిమాలో ఎంతో మంది స్టార్లు నటించారు. అయితే ఈ సినిమా మెయిన్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ అయినా పార్ట్ -1ను  అమితాబ్ బచ్చన్ తన భుజాల మీద మోశాడు. అసలు అశ్వత్థామ పాత్ర అమితాబ్ చేయకుంటే సినిమా పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తున్నది.  80 ఏళ్ల వయసులోనూ కల్కి సినిమాలో  అమితాబ్  ఎనర్జీ చూసి భారతదేశంలో ప్రతి నటుడు బిగ్ బీ నుంచి మరింత ఇన్ స్పైర్ అవుతున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ విడుదలైన ప్రతి చోట కలెక్షన్ల మోతా మోగిస్తున్నది. అయితే ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన చర్చ నడుస్తున్నది. ఈ చారిత్రాత్మక చిత్రం  ప్రభాస్ కంటే ముందు టాలీవుడ్ టాప్ హీరో దగ్గరకు వెళ్లింది. అయితే ఈ సినిమాను  ప్రభాస్ తో చేయమని సూచించింది ఆ హీరోనే.   మహానటి సినిమా బ్లాక్ బస్టర్  తర్వాత  టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్‌లో  మెగా స్టార్  దర్శకుడు  నాగ్ అశ్విన్‌, నిర్మాత సీ అశ్వినీదత్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. నిర్మాతగా అశ్వినీదత్ కు చిరంజీవి  కలిసివచ్చిన హీరో. అశ్వినీదత్ కు  జగదేకవీరుడు-అతిలోక సుందరి లాంటి ట్రెమండస్ హిట్టిచ్చింది చిరంజీవే. ఈ సినిమా కు సీక్వెల్ చేయాలని ఎప్పటి నుంచి అశ్వినీదత్ మనసులో ఉంది. తన సినిమాల్లో రీమేక్ చేస్తే తన తనయుడు రామ్ చరణ్ కు జగదేక వీరుడు అతిలోక సుందరి బాగుంటుందని పలు మార్లు మెగాస్టార్ చిరంజీవే స్వయంగా చెప్పారు. మహానటి సమయంలో అశ్వినీదత్ కు చిరంజీవితోఓ  సినిమా చేయాలనే ఆలోచనతో   జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సీక్వెల్  గురించి చర్చించారు. అయితే అది పట్టాలెక్క లేదు.    

అప్పటికే నాగ్ అశ్విన్ తాను రాసుకున్న కథను కొద్ది రోజులకు చిరంజీవిని కలిసి వినిపించాడు. కథ నచ్చిన మెగాస్టార్ బాగుందని మెచ్చుకున్నారు. సూపర్ హిట్టవుతుందని చెప్పాడు.   ఈ కథ మీకోసం రాశానని, మీతో సినిమా చేయాలని నాగ్ అశ్విన్ చెప్పాడు. భైరవ క్యారెక్టర్ కు తాను నప్పనని సున్నితంగా తిరస్కరించాడు మెగాస్టార్.  కానీ ఇదే క్యారెక్టర్ ప్రభాస్ చేస్తే బాగుంటుందని, సూపర్ హిట్ అవుతుందని చెప్పాడు మెగాస్టార్.  ఇక కథ అక్కడి నుంచి ప్రభాస్ దగ్గరికి వెళ్లడం.. ఓకే అవ్వడం.. అంతా చకచకా జరిగిపోయాయి.  అయితే ప్రస్తుతం సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మెగాస్టార్ జడ్జిమెంట్ కరెక్ట్ అయ్యింది.  సరికొత్త  రికార్డుల దిశగా కల్కి దూసుకుపోతున్నది. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరువచ్చింది.  

Exit mobile version