God Flowers : దేవుళ్లకు పూలంటే ఇష్టం. పూలతో వారిని పూజించడం మన ఆచారం. అందుకే రకరకాల పూలతో దేవుళ్లను కొలుస్తాం. ఈనేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి వాడే పూలు టన్నుల్లో ఉంటాయి. స్వామి వారి అలంకరణ, సేవల కోసం పూలు అవసరమవుతుంటాయి. రోజు తెచ్చే పూలు వాడిపోతాయి కదా వాటిని ఏం చేస్తారనే అనుమానం అందరికి రావడం సహజమే.
డబ్బు ఖర్చు చేసి కొన్న పూలు వాడిపోయాక ఏం చేస్తారు? వాటిని ఏమిటికి వాడతారు? ఎలా ఉపయోగిస్తారనే సందేహం వస్తుంది. పూలు వాడిపోయాక వాటితో అగర్ వత్తీల తయారు చేస్తారు. ఇలా పూల వాడకం సద్వినియోగం చేసుకుంటారు. టీటీడీ ఆధ్వర్యంలో ఆలయాల నుంచి వాడిన పూలను సేకరించి వాటితో అగర్ వత్తులు తయారు చేసి భక్తులకు విక్రయిస్తుంటారు.
ఈ పూలతో ఏడు రకాల అగర్ వత్తీలు తయారు చేస్తుంటారు. ఇలా వాడిన పూలను కూడా ఉపయోగించుకుంటారు. వాటి వాసన నుంచి వచ్చే రకాలను బట్టి అగర్ వత్తులు తయారు చేస్తారు. ఇలా పూలు వాడుకుని అగర్ వత్తులు తయారు చేయడంలో పూలు కీలక పాత్ర వహిస్తుంటాయి. ఈనేపథ్యంలో పూల వినియోగం గురించి చాలా మందికి తెలియదు.
ఆలయాల్లో వాడిన పూలతో అగర్ వత్తులు తయారు చేయడంతో వాటి వాడకానికి ఓ విలువ ఏర్పడింది. వాటితో తయారు చేసే అగర్ వత్తులతో రకరకాల వాసనలు వస్తుంటాయి. ఈక్రమంలో అగర్ వత్తుల తయారులో పూలే ప్రధాన పాత్ర వహిస్తాయనే విషయం చాలా మందికి తెలియదు. ఇలా పూల వాడకానికి ఓ ప్రాధాన్యం ఏర్పడిందని చెబుతుంటారు.