JAISW News Telugu

PM Kisan Money : పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవాలంటే ఏం చేయాలి?

PM Kisan Money

PM Kisan Money

PM Kisan Money : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులకు రైతుబంధు ఇస్తున్నారు. ఏడాదికి రూ.6 వేలు అందజేస్తున్నారు. మూడు విడతల్లో ఇస్తోంది. ఈ పథకం కింద ప్రభుత్వం ఫిబ్రవరిలో రైతులకు రూ.2000 లు వేయనుంది. ప్రభుత్వ అధికార వెబ్ సైట్ http://pmkisan.gov.in లో లబ్ధిదారులు తమ స్టేటస్ గురించి తెలుసుకోవడానికి వీలుంటుంది. జాబితాలో పేరు లేకపోతే అప్రమత్తమై తమ పేరు నమోదు చేయించుకోవచ్చని చెబుతున్నారు.

అక్కడ కింద స్కాల్చేసినప్పుడు ఫార్మర్స్ కార్నర్ అనే విభాగం కనిపిస్తుంది. ఇక్కడ నో యువర్ స్టేటస్ పై క్లిక్ చేయాలి. అప్పుడు ప్రత్యేక పేజీ ఓపెన్ అవుతుంది. లబ్ధిదారులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయాలి. పక్కన కాప్పా కోడ్ ఇవ్వాలి. తరువాత గెట్ ఓటీపీ క్లిక్ చేయాలి. మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. దీంతో లబ్ధిదారుల జాబితా ఓపెన్ అవుతుంది. దీంతో స్టేటస్ తెలుస్తుంది.

కొంతమందికి తమ రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తు ఉండకపోవచ్చు. వారు నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. తరువాత నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆప్షన్ ఎంచుకోవాలి. దాన్ని క్లిక్ చేసినప్పుడు మరో పేజీ ఓపెన్ అవుతుంది. మొబైల్ నెంబర్ లేదా ఆార్ నంబర్ ఇవ్వడం ద్వారా రిజిస్ట్రేషన్ నంబర్ తెలుసుకోవచ్చు. ఇలా పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడం సులభంగా అవుతుంది.

దేశంలోని రైతులందరికి ప్రధానమంత్రి రైతుబంధు ఇస్తోంది. ఏడాదికి రూ.6 వేలు అందజేస్తోంది. విస్తీర్ణంతో సంబంధం లేకుండా భూమి ఉన్న వారికి డబ్బులు వేస్తోంది. దీంతో రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలనేదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. దీంతో ఆ దిశగా అడుగులు వేస్తోంది. ప్రతి రైతు ఖాతాలో డబ్బులు వేస్తూ వారికి చేదోడు వాదోడుగా నిలుస్తోంది.

Exit mobile version