JAISW News Telugu

AP Mee Seva : ఏపీ మీసేవలో ఏయే సేవలు పొందవచ్చు? వివరాలివే ?

AP Mee Seva

AP Mee Seva

AP Mee Seva :  ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజల కోసం మీసేవ పోర్టల్‌లో చాలా సేవలను చేర్చింది.  గుడ్ గవర్నెన్స్ ఇచ్చేందుకు ఈ పోర్టల్‌ని డెవలప్ చేస్తోంది. ఈ మీసేవ వాడడం మనకు కొత్తేమీ కాదు.  దీన్ని కొన్నేళ్లుగా మనం వాడుకుంటూనే ఉన్నాం. కాకపోతే, ప్రస్తుతం గవర్నమెంట్ మారింది కదా దీంతో పోర్టల్‌లో కూడా చాలా మార్పులు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. మీసేవ పోర్టల్‌లో మనం ప్రభుత్వ సేవలను స్వయంగా పొందవచ్చు. అలాగే ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకోలేని వారు దగ్గర్లోనే ఉన్న మీసేవా కేంద్రానికి వెళ్లి.. కొంత డబ్బులు చెల్లించి ఆ సేవల్ని పొందవచ్చు. ఇలా ప్రతీదీ మనం ఇంటి దగ్గర నుంచే పొందేలా ప్రభుత్వాలు ఇలాంటి పోర్టల్స్ తెస్తున్నాయి.

 మీసేవ ద్వారా పొందగలిగే సేవలు ఇవే:
ప్రజా పంపిణీ సేవలు, ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్, ఇండస్ట్రీస్ కమిషన్, జిల్లా పాలనా యంత్రాంగం సేవలు, ఆధార్ సేవలు, CDMA, వ్యవసాయ శాఖ సేవలు, పోలీస్ సేవలు, విద్యా శాఖ సేవలు, ఎన్నికల సేవలు, ఉద్యోగ సేవలు, హౌసింగ్, ఎండోమెంట్, ఆరోగ్య సేవలు, ఐటీసీ, కార్మిక శాఖ సేవలు, లీగల్ మెట్రాలజీ, మైన్స్, జియోలజీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ అడ్మిన్, ఇండస్ట్రీస్ ఇంసెంటివ్స్, NPDCL, రెవెన్యూ, గ్రామాభివృద్ధి, సోషల్ వెల్ఫేర్ ఇలా చాలా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సేవలు పొందవచ్చు.

 మీసేవ ద్వారా సేవలు పొందాలంటే కొన్ని పత్రాలు అవసరం.. ఆధార్ కార్డు, అడ్రెస్ ప్రూఫ్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, బ్యాంక్ అకౌంట్ వివరాలు అవసరం. మీ సేవలో మీరు సేవలు పొందాలంటే.. ముందుగా అధికారిక పోర్టల్ (https://ap.meeseva.gov.in/IMeeSeva2/IMeesevaHome.aspx)కి వెళ్లాలి. హోం పేజీలో మీరు “Meeseva Online Portal” ఆప్షన్ ఎంచుకోవాలి. స్క్రీన్ పైన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో “New Registration” ఆప్షన్ ఎంచుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫారం కనిపిస్తుంది. అందులో అడిగిన వివరాలు ఎంటర్ చెయ్యాలి. తర్వాత మీ మొబైల్‌కి OTP వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి.. కన్ఫర్మ్ ఆప్షన్ క్లిక్ చెయ్యాలి. దాంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. మీకు కన్ఫర్మేషన్ కోసం మెయిల్ ఐడీకి ఈమెయిల్ వస్తుంది. అందులో ఉన్న కోడ్‌ని క్లిక్ చెయ్యాలి. అంతే మీ అకౌంట్ యాక్టివ్ అవుతుంది.

 ఏపీ మీసేవా పోర్టల్‌లో లాగిన్ అయ్యేందుకు అధికారిక పోర్టల్ (https://ap.meeseva.gov.in/IMeeSeva2/IMeesevaHome.aspx)కి వెళ్లాలి. అందులో “Sign In” ఆప్షన్ క్లిక్ చెయ్యాలి. మీకు డ్యాష్ బోర్డ్ కనిపిస్తుంది. అందులో యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఇవ్వాలి. ఆ తర్వాత మీరు రకరకాల సేవల్ని అక్కడ చూస్తారు. వాటి కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ సేవ కోసం అప్లై చేస్తున్నామో దానికి సంబంధించిన పత్రాలను అప్ లోడ్ చేయాలి.  అప్లై చేసుకున్నాక.. వాటి పరిస్థితి ఎలా ఉందో స్టేటస్ కూడా చూసుకోవచ్చు. మీరు వివిధ సేవలు, పథకాల కోసం పెట్టుకున్న దరఖాస్తుల స్టేటస్ చూసేందుకు ముందుగా   మీసేవా పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి. తర్వాత “Application Status” ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ స్టేటస్‌కి సంబంధించి అప్లికేషన్ ఐడీ లేదా ట్రాన్సాక్షన్ ఐడీ ఇవ్వాలి. తర్వాత “Go” బటన్ క్లిక్ చేస్తే, మీ అప్లికేషన్ ఏ స్థాయిలో ఉందో చూపిస్తారు.  జిల్లాలో మీ సేవా కేంద్రాల డేటా కావాలంటే హెల్ప్‌లైన్ నంబర్ Dial 1100 కి కాల్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు.

Exit mobile version