Prashant Kishore : రాష్ట్రం కోసం నితీశ్ ఏమి చేస్తున్నారు: ప్రశాంత్ కిషోర్

Prashant Kishore

Prashant Kishore

Prashant Kishore : రాజకీయ వ్యూహకర్త ప్రశాంతక్ కిశోర్ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘గతంలో ఆయనతో కలిసి పనిచేసిన నేను ఎందుకు విమర్శిస్తున్నానని ప్రజలు నన్ను అడుగుతున్నారు. అప్పుడు సీఎం వేరే వ్యక్తి. కాని ఇప్పుడు మనస్సాక్షిని బీజేపీకి అమ్మకానికి పెట్టారు. ఒక రాష్ట్రానికి నాయకుడిగా ఉండేవాడు అక్కడి ప్రజలు గర్వపడేలా నడుచుకోవాలి. కానీ నితీశ్ కుమర్ బిహార్ కు అవమానాన్ని మిగిల్చారు’’  అని కిశోర్ ఆరోపించారు. మోదీ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించిన నితీశ్ కుమార్ రాష్ట్ర ప్రయోజనాల కోసం తన పలుకుబడిని ఉపయోగించట్లేదని మండిపడ్డారు.

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ మార్కును దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కౌంటింగ్ కు ముందు ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు. అయితే, ఆ పార్టీకి మెజారిటీ మార్కు కంటే సీట్లు తగ్గాయి. ఎగ్జిట్ పోల్స్ తప్పని నిరూపిస్తూ ఇండియా కూటమి 234 లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. అయితే, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు మెజార్టీ రావండంతో ప్రధాని మోదీ తిరిగి బాధ్యతలు చేపట్టారు.

TAGS