Glenn Maxwell : ఏంటి మాక్స్ వెల్.. ఇదేం పని?..క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన నిర్ణయం..

Cricket Australia tough decision on maxwell
Glenn Maxwell : మాక్స్ వెల్.. ప్రపంచ క్రికెట్ కు పరిచయం అక్కర్లేని పేరు. ఆస్ట్రేలియా జట్టుకు ఎన్నో సార్లు ఒంటిచేత్తో విజయాలను అందించాడు. వరల్డ్ కప్ లో మాక్స్ వెల్ చేసిన అద్భుత డబుల్ సెంచరీని ఇప్పట్లో ఎవరూ మరిచిపోరు.
అలాంటి మాక్స్ వెల్ క్రికెట్ ఆస్ట్రేలియా తలదించుకునేంత పని చేశాడు. ఓ పార్టీలో తప్పతాగి పడిపోయాడు. స్పృహ కోల్పోయిన మాక్స్ వెల్ ను ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. ఆడిలైడ్ లో జరిగిన ఓ సంగీత విభావరిలో పాల్గొన్న మాక్స్ వెల్ అక్కడ ఫుల్లుగా మద్యం తాగాడు. ఆ తర్వాత స్పృహ తప్పి పడిపోయాడు. మాక్సీని లేపడానికి సన్నిహితులు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు అంబులెన్స్ సహాయంతో మాక్సీని ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది.
కాగా, ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా సీరియస్ అయ్యింది. ఓ పబ్లిక్ ఫంక్షన్ లో మాక్స్ వెల్ ఇలా ఎందుకు ప్రవర్తించాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశాడు. ఇలాంటి ఘటనలు జరగకూడదని, ప్రజంతా గమినిస్తూ ఉంటారని, ఎవరు తీసుకునే నిర్ణయాలకు, ఎవరు చేసిన తప్పులకు వారే బాధ్యులని పరోక్షంగా మాక్సీని హెచ్చరించాడు. ఈ ఘటనపై విచారణ జరపాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా ఉంటుంది. ఆటగాళ్లు క్రమశిక్షణ తప్పితే అసలే ఉపేక్షించదు.
మాక్స్ వెల్ విషయంలోనూ బోర్డు కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఊహగానాలు వినపడుతున్నాయి. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో మాక్స్ ఆడుతున్నాడు. తన జట్టు ప్లే ఆఫ్ చేరుకోవడంలో విఫలమైంది. దానికి తోడు వెస్టిండీస్ తో జరుగబోయే సిరీస్ లో మాక్స్ లో జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఆ బాధలో మాక్స్ వెల్ తప్పతాగి ఇలా ప్రవర్తించాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు.