High Court : అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు పెడితే తప్పేంటి?: హైకోర్టు

High Court

High Court

High Court Comments : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు పెడితే తప్పేముందని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. జడ్జిలను దూషిస్తూ పోస్టులు పెట్టారని వ్యాఖ్యానించింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి ఉత్తర్వులను ఇవ్వలేమని పేర్కొంది. కేసులపై అభ్యంతరముంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని తెలిపింది. పిల్ వేయడానికి వీలు లేదని పేర్కొంది. సోషల్ మీడియా కార్యకర్తలపై మూకుమ్మడిగా కేసులు పెడుతున్నారని విజయబాబు హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.

TAGS