Wipro CEO : విప్రో కంపెనీకి సీఈవోగా శ్రీనివాస్ పల్లియా నియమితులయ్యారు. థియరీ డెలాపోర్టే రాజీనామా తర్వాత శ్రీనివాస్ కొత్తగా బాధ్యతలు చేపట్టారు. డెలాపోర్టేకు 2025 వరకు సమయం ఉన్నా సంవత్సరం ముందుగానే రిజైన్ చేశారు. ఈ నేపథ్యంలో కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ పల్లియా సాలరీ వివరాలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. ఆయన ఏడాదికి 7 మిలియన్ డాలర్ల వేతనం అందుకుంటారని తెలుస్తోంది. భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 58.38 కోట్లు. అందులో ఆయన బేసిక్ వేతనం 1.75 మిలియన్ డాలర్ల నుంచి 3 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుంది.
దీంతో పాటు వేరెబుల్ పే రూపంలో 1.75 నుంచి 3 మిలియన్ డాలర్ల మధ్య పొందనున్నారు. కంపెనీ సాధించిన ప్రగతి ఆధారంగా ఈ చెల్లింపులు ఉంటాయి. అలాగే ఆయనకు స్టాక్స్ రూపంలో మరికొన్ని ప్రయోజనాలు ఉంటాయి. 4 మిలియన్ డాలర్ల విలువైన రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్, పెర్ఫార్మెన్స్ స్టాక్ యూనిట్లు ఆయన పేరుమీద ఉంటాయి. అవి దశలవారిగా ఆయనకు లభిస్తాయి.