Sunny Leone : ఇదేంది సామీ.. కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేసుకున్న సన్నీలియోన్!
Sunny Leone : బాలీవుడ్ నటి సన్నీలియోన్.. కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేసుకున్న వార్త ఇప్పుడు వైరల్ అయ్యింది. ఆమె ఎందుకలా చేసుకుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా ఆమెకు ఏమాత్రం సంబంధం లేకుండా ఆమె పేరు తెరపైకి వచ్చింది. కారణం.. ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టే బుల్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులో ఆమె పేరు ఉండ టమే కాదు.. ఆమె ఫొటోలు కూడా ఉన్నాయి. దాంతో అక్కడి సైబర్ సెల్ దీన్ని పరిశీలించాల్సిన పరిస్థితి వచ్చింది.
చెప్పాలంటే ఇది ఉత్తరప్రదేశ్ పోలీసులకు షాకింగ్ విషయమే. అడ్మిట్ కార్డులో సన్నీలియోన్ పేరు, ఫొటోలు ఎలా వచ్చాయి? కానిస్టేబుల్ ఉద్యోగానికి ఆమె అప్లై చేసుకోదు కదా. అలాంటప్పుడు ఆమె పేరు, ఫొటోతో అడ్మిట్ కార్డు ఎలా తయారైంది? ఈ అంశాన్ని యూపీ పోలీస్ సైబర్ సెల్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
ఉత్తరప్రదేశ్‌లో 60,244 ఖాళీల కోసం ఫిబ్రవరి 17న యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, ఎగ్జామ్ నిర్వహించింది. 48 లక్షల మంది ఈ పరీక్ష రాశారు. ఐతే, కన్నోజ్ జిల్లాలో.. శ్రీమతి సోన్ శ్రీ స్మారక్ బాలికా మహా విద్యాలయలో ఒకరు పరీక్ష రాయ డానికి రాలేదని తెలిసింది. ఎందుకు అని పరిశీ లించగా, ఆ సీటు రోల్ నంబర్‌పై సన్నీలి యోన్ అని రాసివుంది. యూపీ పోలీసులే ఈ కార్డును జారీ చేశారు. మరి ఇది వారు ఎందుకు కనిపెట్టలేదు?
కన్నౌజ్ ASP అమిత్ కుమార్ ఆనంద్ దీనిపై మాట్లాడుతూ.. “దర్యాప్తు చేస్తున్నాం. కస్గంజ్ జిల్లా నుంచి ఆ నటి అప్లై చేసుకున్నట్లు ఉంది. దీన్ని కస్గంజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు అడ్మిట్ కార్డు అలా ఎలా జారీ చేశారో యూపీ పోలీసులు పరిశీలిస్తున్నారు” అని తెలిపారు.