Pawan Varahi Deeksha : ఏంటన్నా ఇది.. చెప్పులు వేసుకుని అమ్మవారి దీక్షా?

Pawan Kalyan Varahi Deeksha
Pawan Varahi Deeksha : జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. అంటే జూన్ 26 వ తేదీ నుంచి పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష ప్రారంభించారు. కాగా ఈ దీక్ష 11 రోజుల పాటు కొనసాగుతుంది. అయితే పవన్ కల్యాణ్ నేడు అమ్మవారి బట్టల్లో చెప్పులు వేసుకుని దర్శనమివ్వడం.. సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఎంతో పద్ధతిగా నుదుటగా బొట్టు, పసుపు రంగు అమ్మవారి బట్టల్లో పవన్ జనాలను ఆకట్టుకుంటున్నప్పటికీ ఆయన దీక్షలో చెప్పులు ధరించడం జనాలను షాక్‌కు గురిచేస్తుంది. ఇక్కడే అనుకోకుండా పవన్ వివాదంలో చిక్కుకున్నారు. పవన్ కల్యాణ్ చెప్పులు ధరించి దీక్ష చేయడం హిందువులను కించ పరచడమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో హిందూమతం గురించి గొప్పగా చెప్పిన ఆయనకు చెప్పులు వేసుకుని దీక్ష చేయకూడదన్న విషయం కూడా తెలియకపోవడం ఆయన అవివేకానికి నిదర్శనం అంటూ మంత్రి పవన్ కల్యాణ్ పై మండిపడుతున్నారు.
గతంలో కూడా పవన్ కల్యాణ్ దీక్ష చేపట్టినప్పుడు చెప్పులు ధరించారు. ఎన్నికల ముందు అభిమాని ఇచ్చిన వెంకటేశ్వరస్వామి ఫొటోను చెప్పులు వేసుకునే తీసుకున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ చెప్పులు వేసుకుని అమ్మవారి దీక్షకు సంబంధించిన ఫొటోలను కాంట్రవర్సీ బ్యూటీ శ్రీరెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసింది. పవన్ పిక్‌కు ‘బీజేపీని మెప్పించడానికా? చెప్పుతో దీక్షలు.. వాట్ ఏ హిందూ ఫాలోవర్’ అంటూ రెండు పగలబడి నవ్వే బొమ్మలను జోడించింది. ఇక ఈ దీక్షలో డిప్యూటీ సీఎం కేవలం పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారంట. గత ఏడాది జూన్ లో పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. ఎన్నో అపజయాల తర్వాత పవన్ 2024 ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. గత పదేళ్లుగా వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలను, సవాళ్లను ఎదుర్కొన్న పవన్ వాటన్నింటికీ ఈ విజయంతో సమాధానమిచ్చారు.