BJP Manifesto : భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. అన్ని వర్గాల ప్రజలకు అనువుగా ఉండేలా తయారు చేసింది. దాదాపు 15 లక్షల మంది పంపించిన సలహాల నుంచి 14 అంశాలను తీసుకుని మేనిఫెస్టో రూపకల్పన చేసింది. రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో 27 మంది సభ్యుల కమిటీ మేనిఫెస్టోను తయారు చేసింది. దేశ ప్రగతి, యువ, మహిళలు, పేదలు, రైతులే అజెండాగా రూపొందించారు.
మేనిపెస్టోలో ముసలి వారికి ఆయుష్మాన్ పథకంలో భాగంగా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం, మూడు కోట్ల మందికి ఇళ్ల నిర్మాణం, పదేళ్లు ఉచిత రేషన్, పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా, ముద్ర రుణాల పరిమితి రూ. 20 లక్షలకు పెంపు, దివ్యాంగుల కోసం ఇళ్లనిర్మాణం, ట్రాన్స్ జెండర్లకు ఆయుష్మాన్ భారత్, ముసలి వారి కోసం ఆయుష్ శిబిరాలు, వృద్ధులకు చేయూత లాంటి పథకాలు.
మూడు కోట్ల మంది మహిళలకు లక్షాధికారులుగా చేసే ప్రణాళిక, డెయిరీ సహకార సంఘాల సంఖ్య పెంపు, కూరగాయల సాగుకు ప్రత్యేక క్లస్టర్లు, మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం, రైతులకు సహకారం, పంటల మద్దతు ధర పెంపు, వ్యవసాయ అవసరాల కసం ప్రత్యేక ఉపగ్రహం, వ్యవసాయ మౌలిక వసతుల మిషన్ ప్రారంభం తదితర పథకాలు ఉన్నాయి.
తమిళ భాష ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడం, విమానయాన రంగానికి ప్రోత్సాహం, విద్యుత్ వాహక రంగానికి ఊతం, వందేభారత్ విస్తరణ, ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో బుల్లెట్ రైళ్ల విస్తరణ, అంతరిక్ష రంగంలో భారత సామర్థ్యాన్ని పెంచడం, విదేశాల్లోని భద్రతకు హామీ, ఉద్యోగ నియామకాల్లో పేపర్ లీకేజీల నివారణకు చర్యలు తీసుకోవడం వంటి పథకాలు తీసుకొచ్చేందుకు సంకల్పించింది.
బీజేపీ తయారు చేసిన మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు సంతోషం కలిగించేలా ఉంది. దీంతో బీజేపీ మేనిఫెస్టోతో ఓట్లు రాబట్టుకునేందుకు ముమ్మరంగా ఆకట్టుకుంటోంది. బీజేపీ మేనిఫెస్టో తయారుతో ఒకడుగు ముందుకు వేసింది.