KTR : కేటీఆర్ రెగ్యులర్ పోస్టుల వెనుక దాగున్న నిజం ఏంటి..? అరెస్ట్ జరుగుతుందా..?
బీఆర్ఎస్ ఓటమిని జీర్ణించుకోలేని పార్టీ పెద్ద మనిషి కొన్ని రోజులు ఆరోగ్యం బాగా లేదని, మరి కొన్ని రోజులు రెస్ట్ కావాలని ఇంటికే పరిమితం అయ్యాడు. ఈ నేపథ్యంలో చుక్కాని లేని నావలా తయారైంది బీఆర్ఎస్ పరిస్థితి. యంగ్ హీరో కేటీఆర్ పార్టీ బాధ్యతలను భుజాన ఎత్తుకున్నా జనాల్లోకి మాత్రం వెళ్లలేకపోతోంది. ఇగో ఇప్పుడస్తాడు.. అగో అప్పుడస్తాడు.. అంటూ పార్టీ నాయకులు ప్రజలను మభ్య పెడుతున్నారు. ఇప్పటికే కొందరు నాయకులు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు.
కేటీఆర్ కు డిజిటల్ పరిజ్ఞానం ఎక్కువగా ఉండడంతో ఆయన సోషల్ మీడియా టీమ్ లపై ఆధారపడుతున్నారు. తమ మాత్రు మీడియా ‘నమస్తే తెలంగాణ’ ఇప్పటికే ప్రజల్లో ఆదరణ కోల్పోయింది. దీంతో డిజిటల్ ను పట్టకోవడం తప్పనిసరిగా మారింది. తమ పార్టీలోని ఓ పెద్ద నాయకుడిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ ఇటీవల కేటీఆర్ పరోక్షంగా పలు పోస్టులు పెడుతున్నారు.
డిసెంబర్ మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి తన ఏడాది పదవీకాలం ముగిసింది, ఏడాదిలో ఆయన చేపట్టింది శూన్యం అని, దాని నుంచి దృష్టి మరల్చేందుకే రేవంత్ రెడ్డి ఈ అరెస్టు చేస్తున్నారని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో ఎవరికీ తెలియదు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతుంది. అసలు ఎవరినైనా అరెస్టు చేస్తారా అనేది ఇంకా తెలియరాలేదు.