Anil Ravipudi : ఆ స్టార్ కమెడియన్ ను అనిల్ రావిపూడి పక్కన పెట్టడానికి కారణమిదే..?
Anil Ravipudi : టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. పటాస్ నుంచి భగత్ కేసరి చిత్రం వరకు తీసిన ప్రతీ సినిమా హిట్లుగానే నిలిచాయి. ఇక పటాస్, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరూ, భగవంత్ కేసరి చిత్రాలు కమర్షియల్ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. దర్శకుడిగా అనిల్ రావిపూడికి మంచి పేరు కూడా తెచ్చిపెట్టాయి.
ఇక అనిల్ రావిపూడి చిత్రాల్లో కచ్చితంగా రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాస రెడ్డి, పృథ్వీరాజ్ కచ్చితంగా ఉంటారు. అనిల్ తన సినిమాల్లో వారిపై సెపరేట్ కామెడీ ట్రాక్ కూడా క్రియేట్ చేస్తుంటారు. పటాస్, ఎఫ్2, సరిలేరు చిత్రాల్లో రాజేంద్ర ప్రసాద్ పై కోసం పెట్టిన కామెడీ ట్రాక్ వర్కౌట్ అయ్యింది కూడా. ఆయా సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ కామెడీ ట్రాక్ ను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు కూడా.
ఇక తన సినిమాల్లో ఇప్పటి దాకా టాలీవుడ్ టాప్ కమెడియన్ సప్తగిరికి ఇప్పటి దాకా ఒక్క సినిమాలో కూడా అవకాశం ఇవ్వవేలు. అయితే వీరిద్దరూ మంచి మిత్రులు. వీరిద్దరూ కలిసి చాలా చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేశారు. అనిల్ రైటర్ గా కూడా పని చేశారు. అనిల్ రచయిత గా పని చేసిన కందిరీగ సినిమాలో ఓ సీన్ తన కోసం రాసుకున్నాడట. అదే సినిమాకు అసిస్టెంట్ గా పని చేసిన సప్తగిరి ఆ సీన్ చేయాల్సి వచ్చింది. ఈ ఒక్క క్యారెక్టర్ సప్తగిరి కెరీర్ ను మార్చేసింది. అంత మంచి క్యారెక్టర్ రాసిన అనిల్ ను సప్తగిరి ఎన్నోసార్లు గుర్తు చేసుకున్నాడట. అనిల్ సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అయితేనే చేస్తానని, ఇలా వచ్చి అలా వెళ్లిపోయే చేయనని చెప్పాడట. దీంతో అనిల్ సప్తగిరికి సరిపడా క్యారెక్టర్ ఉన్నప్పుడు తన సినిమాలో చేయించుకుంటానని ఇటీవల చెప్పుకొచ్చాడు.