Ravi Teja : మాస్ మహరాజ్ రవితేజ టైగర్ నాగేశ్వర్ రావు తర్వాత వస్తున్న సినిమా ‘మిస్టర్ బచ్చన్’. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. పాత రవితేజ (ఎనర్జటిక్ రవితేజ)ను చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ‘మిస్టర్ బచ్చన్’ ఆగస్ట్ 15వ తేదీ విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారాన్ని ప్రారంభించింది టీమ్. ఇందులో భాగంగా ఫుల్ టీజర్ ను రిలీజ్ చేసింది.
ఈ సినిమాలో తొలి లిరికల్ సాంగ్‌ను ఇటీవల విడుదల చేశారు. కొద్ది రోజుల క్రితం ఈ పాట ప్రోమో విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హీరోయిన్ గ్లామర్ గురించి జోరుగా చర్చలు జరిగాయి. రీసెంట్ గా రిలీజైన సాంగ్ లో భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ అభిమానులను ఉర్రూతలూగించింది. మిక్కీ జే మేయర్ ఈ మూవీకి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ సాంగ్ ను లిరిక్ రైటర్ సాహితి రచించారు. ఈ రొమాంటిక్ పాటలో సాహిత్యం అద్భుతంగా ఉంది. సాకేత్, సమీరా భరద్వాజ్ స్వరం మరింత వీనుల విందుగా అనిపించింది.
రవితేజ, భాగ్యశ్రీ మధ్య మంచి కెమిస్ట్రీ నడిచినట్లు కనిపించింది. వీరిద్దరూ రొమాంటిక్ గా డ్యాన్స్ చేసి అభిమానులను అలరించారు. భాగ్యశ్రీ బోర్సే వెనుక జేబులో రవితేజ చేతులు పెట్టి చేసిన స్టెప్పులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
56 ఏళ్ల రవితేజ 25 ఏళ్ల భాగ్యశ్రీ బోర్స్‌తో రొమాంటిక్ స్టెప్పులు వేశాడు. కొందరు సోషల్ మీడియాలో ఈ సాంగ్ ను ట్రోల్ చేస్తున్నారు. ఇంత వయసులో రొమాన్స్ అవసరమా? అని విమర్శలు గుప్పించారు. ‘పాకెట్ సాంగ్’ అని కొందరు అంటే ‘బ్యాక్ పాకెట్ సాంగ్’ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. రవితేజ కాదు ‘కామ తేజ’ అని మరికొందరు ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు.
ఈ పాటలో రవితేజ స్టైలిష్ దుస్తులు ధరించి మరింత యంగ్ గా కనిపించాడు. నటి భాగ్యశ్రీ గ్లామర్ కట్టిపడేసింది. రవితేజ డ్యాన్స్ మూమెంట్స్ బాగున్నాయి. శేఖర్ మాస్టర్ బెస్ట్ కొరియోగ్రఫీని సమకూర్చి, పాటకు మరింత సొగసు అద్దాడు.