Nara Lokesh : మంగళగిరిలో లోకేశ్ పై ఏం కుట్ర జరుగుతోంది?
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4వ తేదీన మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగు వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారనుంది. ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ పోటీలో ఉండడంతో 2019 ఓటమిని దృష్టిలో ఉంచుకొని ఆయనకు ఈ ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవిగా తెలుస్తోంది. లోకేష్ కు ఇప్పుడు ఇక్కడ గెలుపు తప్పనిసరి.
ఇక మంగళగిరిలో దాఖలైన నామినేషన్ల సంఖ్య విషయానికి వస్తే ఏపీలో ఏ స్టార్ నియోజకవర్గానికి లేనంతగా ఇక్కడ 65 నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళగిరి నుంచి అనూహ్యంగా అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయని, ఓట్ల చీలిక కోసమే ఇన్ని నామినేషన్లు వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పోటీ కూడా తీవ్రంగాఉంటుందని చెప్తున్నారు.
ఒక్కమాటలో చెప్పాలంటే జగన్ పులివెందులలో 37 నామినేషన్లు ఉండగా, మంగళగిరితో పోలిస్తే దాదాపు సగం నామినేషన్లు దాఖలయ్యాయి. చంద్రబాబు నాయుడు పోటీలో ఉన్న కుప్పంలో ఈ సంఖ్య 22గా ఉంది. పవన్ పిఠాపురం, బాలకృష్ణ హిందూపురంలో 19 చొప్పున ఉండగా, మంగళగిరిలో కంటే ఇది చాలా తక్కువ.
ఈ ఓట్ల మళ్లింపు ఎత్తుగడలు ఒకవైపు ఉంటే, మంగళగిరిని కనీసం 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు నారా లోకేష్ ధీమాగా హామీ ఇచ్చారు. ఇక్కడ ఆయనకు ప్రధాన ప్రత్యర్థి వైసీపీకి చెందిన మురుగుడు లావణ్య. గతంలో కూడా ఈమెపైనే నారా లోకేశ్ ఓడిపోయారు. ఈ సారి కూడా ఓడిపోతే లోకేశ్ రాజకీయ కెరీర్ ఎటు వైపునకు తిప్పుకుంటాడో అంటూ కామెంట్లు వినిపిస్తు్న్నాయి.