JAISW News Telugu

Prabhas Kalki : కల్కిలో ఆ అదిరిపోయే ఐడియా ప్రభాస్ దేనట?

Prabhas Kalki

Prabhas Kalki

Prabhas Kalki : కల్కి 2898 ఏడీ మూవీ చూస్తున్నంత సేపు అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ క్యారెక్టరే ప్రధానంగా కనిపిస్తోంది. ఆ పాత్ర చుట్టే సినిమా నడిచినట్లు అనిపిస్తోంది. కల్కి జన్మనివ్వబోయే సుమతిని కాపాడటానికి అశ్వత్థామ రావడం అనేది సినిమాకే హైలైట్. అయితే ప్రభాస్ పాత్రలో భైరవ పాత్రలో నెగిటివ్ షెడ్స్ లో అమితాబ్ తో పోరాటం చేసేలా కనిపిస్తోంది. 

సినిమాలో సుమతిని విలన్ మనుషులకి అప్పగించడానికి ఫైట్ చేస్తాడు. ఫైనల్ యాక్షన్ సీక్వెన్స్ లో కూడా అశ్వత్థామ భైరవ ప్రాణాలు తీసేంత వరకు వెళ్లగా.. కర్ణుడిగా భైరవ పాత్ర ట్రాన్స్ ఫర్ కావడం చర్చగా మారుతుంది. అయితే విలన్ ను కిల్ చేసి సుమతిని కాపాడతాడు కర్ణుడిగా మారిన భైరవ. దీనికి థియేటర్లలో ప్రేక్షకుల నుంచి ఫుల్ విజిల్స్ పడ్డాయి. కానీ కర్ణుడి ఐడియా మాత్రం ప్రభాస్ నుంచి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. భాగవతంలో కర్ణుడి పాత్ర లేకున్నా.. నాగ్ అశ్విన్ మాత్రం భైరవ నుంచి కర్ణుడికి ట్రాన్స్ ఫర్ అయ్యేలా కనెక్ట్ చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. 

అయితే భైరవికి మైథాలజీ హరో క్యారెక్టర్ ని తీసుకోవాలని ప్రభాస్ ఇచ్చిన కారణంగానే ఇది సక్సెస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. నాగ్ అశ్విన్ కి ఇలా సలహాలు ఇవ్వడం అనేది దాన్ని ఒక డైరెక్టర్ స్పోర్టివ్ గా తీసుకోవడం అనేది చాలా సక్సెస్ ఫుల్ గా జరిగింది. 

నాగ్ అశ్విన్ కాస్తా సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఈ క్యారెక్టర్ ని కల్కి స్టోరీకి లింక్ చేసినట్లుగా కనిపిస్తోంది. దీంతో ఆడియన్స్ చాలా ఇంప్రెస్ అయ్యారు. హిందూ పురాణాలు, ఇతిహాసాలు నమ్మేవారు మాత్రం దీన్ని కొద్దిగా విమర్శిస్తున్నారు. కల్కి పురాణంతో సంబంధం లేని కర్ణుడిని రిప్రజెంట్ చేయడం భారతీయ ఇతిహాసాలని వక్రీకరించడమే అని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. కల్కి పుట్టుక ఏ విధంగా ఉండబోతుందనేది చూపించిన నాగ్ అశ్విన్ క్లైమాక్స్ ను తీర్చిదిద్దిన తీరు అనిర్వచనీయమని చెప్పొచ్చు.

Exit mobile version