Pawan Kalyan : జనసేన అధినేత, ప్రముఖ తెలుగు సినీ నటుడు పవన్ కళ్యాణ్ సినిమా రంగానికి కొంత విరామం ఇచ్చారు. రాజకీయ రంగంలో కాలుమోపారు. 2014 లో జనసేన పార్టీని నిర్మించారు. 2019 లో ఒంటరిగానే ఏపీ లో పోటీచేశారు. పవన్ కళ్యాణ్ కూడా రెదను స్థానాల్లో పోటీచేశారు. కానీ రెండు స్థానాల్లో ఓటమి చెందారు. తాజా ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పార్టీలతో పొత్తుపెట్టుకొని కూటమిగా ఏర్పడ్డారు. జనసేన ఏపీలో 21 స్థానాల్లో పోటీపడుతోంది. అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలో ఉన్నారు. అయన గెలుపు పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా వంగ గీత పోటీచేస్తున్నారు. ఆమె స్థానికులు రాలు. సిట్టింగ్ ఎమ్మెల్యే. అధికారంలో ఉన్న ఆమె ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసిన గుర్తింపు ఉంది. ప్రజలకు అందుబాటులో ఉన్నది. ఈ నేపథ్యంలో ఆమెకు ఓటుబ్యాంక్ కచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఓట్లను చీల్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. పిఠాపురం నియోజక వర్గంలో కాపు కులస్తుల ఓట్లు సుమారు 90 వేల కుటుంబాలవి ఉన్నవి. వీరిలో యువత ఓట్లు అధికంగా పవన్ కళ్యాణ్ కె పడినట్టు సర్వే లు చెబుతున్నాయి. కానీ పెద్దవాళ్ళు అంతా కూడా పవన్ కళ్యాణ్ కు కాకుండా వైసీపీ అభ్యర్థివైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నమ్ముకున్న కాపు కులస్తులు అండగా నిలబడలేదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ గెలుపు కోసం బీజేపీ, టీడీపీ నేతలు చెమటోడ్చారు. జనసేన సైనికులు అహర్నిశలు కష్టపడ్డారు. సినీపరిశ్రమ దిగివచ్చింది. పరిశ్రమ పెద్దలు అండగా నిలిచారు. 2019 కంటే 2024 ఎన్నికల్లో ఎట్లా శాతం పెరిగింది. పెరిగిన ఓట్ల శాతం ఎవరి గెలుపుకు సహకరిస్తుందో అంతుపట్టడంలేదు. కానీ పోలింగ్ ముగిసిన రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ లక్ష మెజార్టీ తో గెలవడం ఖాయమని సంబర పడ్డారు. మరి కొద్దిరోజుల తరువాత యాభయ్ వేల మెజార్టీ వస్తుందని జనసేన నేతలు ధీమా వ్యక్తం చేశారు. చివరకు పది నుంచి ఇరవై వేల మెజార్టీ తో జనసేన అధినేత గెలవడం ఖాయమంటున్నారు.