Jagan Politics : ఎన్నికలకు ఆరు నెలల ముందు శంకుస్థాపనలు చేయడం ప్రజలను మోసగించడమేనని గత ఎన్నికల ముందు వైసీపీ అధినేత చేసిన వ్యాఖ్యలు ఇవి. ప్రస్తుతం అధికారం మారింది. అప్పుడు టీడీపీ అధికారలో ఉండగా, ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. అంటే అప్పుడు చంద్రబాబు చేసిన పనులను మోసపూరితం అంటూ విమర్శించిన జగన్ ఇప్పుడు చేస్తున్నదేమిటనే చర్చ ఏపీలో మొదలైంది. ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందుగానే సీఎం జగన్ శంకుస్థాపనలను చేసుకుంటూ పోతున్నారు. వాటికి కనీసం టెండర్లు కూడా పిలవడం లేదు. కాంట్రాక్టులు కూడా కుదరలేదు. కానీ జగన్ మాత్రం ఇవేమి పట్టించుకోకుండానే ముందుకు సాగుతున్నారు. మంగళవారం సుళ్లూరుపేటలో మత్స్యకారులకు సంబంధించిన పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. కానీ ఆ పనులకు టెండర్లు పిలవలేదు.
అసలు టెండర్లు పిలవకపోవడం కాదు.. పిలిచినా ఎవరూ రాలేదనేది నిజం. నాలుగురు సార్లు టెండర్లు పిలిచినా ఒక్కరూ కాంట్రాక్ట్ తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. మళ్లీ ఆ మేఘా వాళ్లకో లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డికో చెప్పి.. ఆ పనులు తీసుకోవాలని డబ్బులు వచ్చే ప్రభుత్వం ఇస్తుందని బాండ్ రాసిస్తామని కూడా చెప్పడం లేదు. ఎందుకటే పనులు చేయించాలనే ఉద్దేశం జగన్ లో కనిపించడం లేదు. ఒక వేళ కాంట్రాక్టర్ ముందుకు వచ్చి పనులు చేసినా వాళ్లకు డబ్బులు ఇవ్వరు. అందుకే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదనేది బహిరంగ సత్యం.
ఈ శంకుస్థాపలు ఎందుకంటే.. వాటిని తన ప్రచారానికి అనుకూలంగా మార్చుకోవడానికి. ప్రజాధనం ఖర్చు పెట్టి పార్టీని ఎలా నడపాలలో వైసీపీ అధినేత జగన్ కు బాగా తెలుసు. ఈ శంకుస్థాపనలు చూస్తుంటేనే జగన్ అంతరార్థం తెలుస్తున్నది. పార్టీ పేరుతో జిల్లాలో నేరగా సభలు పెట్టలేక.. ప్రజాధనంతో ఏర్పాటు చేస్తున్నారు. కరపత్రాలు, జెండాలు,పోస్టర్లు ఇలా ప్రతీది మొత్తం ప్రభుత్వ ఖర్చుతోనే కానిచ్చేవచ్చన్నది జగన్ ప్లాన్. అంటే జగన్ రెడ్డి తెలివి తేటలన్నీ ఆయన సొంత వ్యాపారాలు, వ్యాపకాలుతో పాటు పార్టీ ఖర్చులు మిగుల్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. కానీ.. ప్రజలకు మాత్రం చేకూరే ప్రయోజనం మాత్రం ఏమీ లేదు.