Kaleswaram : కాళేశ్వరం విషయంలో ఏం జరుగుతోంది?

Kaleswaram Project

Kaleswaram Project

Kaleswaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం రాజకీయాలను శాసిస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కాళేశ్వరం ఓ హాట్ టాపిక్ గా మారుతోంది. ఒకరి మీద మరొకరు బురద జల్లుకునేందుకు కారణంగా నిలుస్తోంది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా కాళేశ్వరంపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటే అయినందున వారిపై చర్యలకు వెనకాడుతున్నారని గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాత్రం ఎందుకు చర్యలకు ముందుకు రావడం లేదు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై ఫిర్యాదు చేస్తే రెండు రోజుల్లోనే సీబీఐతో విచారించేందుకు సిద్ధంగా ఉన్నామని సవాలు విసురుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం నోరు విప్పడం లేదు. ఈనేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు మరోమారు వార్తల్లో నిలుస్తోంది. ఇదివరకే మంత్రులు కాళేశ్వరంపై చర్యలు తీసుకుంటామని ప్రకటించినా ఆ దిశగా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏం జరగబోతోందనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులకు విచారణ జరిపిస్తే శిక్ష ఖాయమనే వాదనలు కూడా వస్తున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఎలాంటి ముందడుగు వేయడం లేదు. దీంతోనే కాళేశ్వరం పరిస్థితిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదనే ప్రశ్నలు రావడం సహజం.

కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ చేయిస్తామని ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్ ఇప్పుడు మాట మార్చుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రం ముందుకు రావడం లేదని ఆరోపణలు చేసిన పార్టీకి ఇప్పుడు సవాళ్లు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ నేతల మౌనం వెనుక అంతరార్థం ఏమిటనే ప్రశ్నలు బీజేపీనేతలు వేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఒకటా? లేక బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటా అనే వాదనలు బీజేపీ నేతల నుంచి రావడం గమనార్హం.

TAGS