Hanuman Promise to Rama : సూపర్ హీరో కథతో తెరకెక్కిన మూవీ ‘హను-మాన్’. ఈ సినిమా ఈ రోజు (జనవరి 12) రిలీజైంది. మార్నింగ్ షో ఫస్ట్ ఆఫ్ నుంచే బాక్సాఫీస్ టాక్ దక్కించుకుంది. మహేశ్ బాబు గుంటూరు కారం కూడా రిలీజ్ కాగా డిజాస్టర్ టాక్ దక్కించుకుంది. దీంతో గుంటూరు కారంకు వెళ్లాలని అనుకున్న వారంతా హను-మాన్ కు షిఫ్ట్ అవుతున్నారు. ఇందతా పక్కన ఉంచితే.. హను-మాన్ కు సీక్వెల్ ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ చివరలో చెప్తాడు. దీన్ని విపరీతమైన హైప్ కు తీసుకెళ్లేందుకు మేకర్స్ ఆ మూవీని ఫాలోఅవుతున్నట్లు తెలుస్తోంది.
బాహుబలి గుర్తుండే ఉంటుంది. బాహుబలి 1లో చివరి సీన్ కట్టప్ప బాహుబలిని చంపుతాడు. ఇక అక్కడి నుంచి బాహుబలి 2 వరకు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే క్వశ్చనే ప్రతీ ఒక్కరి నోటిలో నానింది. ఇది ఎంతలా అంటే చాలా సినిమాల్లో కూడా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు (వై కట్టప్ప కిల్డ్ బాహుబలి).. అంటూ డైలాగ్ ను వాడుకున్నారు కొన్ని సినిమాల దర్శకులు. దీంతో బాహుబలి 2పై ఎక్స్‌పెక్టేషన్స్ విపరీతంగా పెరుగుతూ వచ్చింది. సినిమా రిలీజ్ ఎప్పుడు అంటూ ఇండస్ట్రీలో జక్కన్నను అడగని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా హైప్ తెచ్చింది ఈ డైలాగ్.
ఇప్పుడు హను-మాన్ లో కూడా ఇదే స్టంట్ ను ఉపయోగించి ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించాలని చూస్తున్నారు. హనుమాన్ లో ‘హనుమంతుడు రాముడికి చేసిన ప్రామిస్ ఏంటి?’ అని క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు దర్శకుడు. అసలు అదేంటో తెలియాలంటే 2025 వరకు వేచి చూడాల్సిందే. ఇప్పుడిప్పుడే ఈ టాక్ జనాల్లోకి వెళ్తుంది. హను-మాన్ భారీ కలెక్షన్లను దక్కించుకునేందుకు ఇది కూడా ఉపయోగపడుతుంది.