Pawan Kalyan Case in Tamil Nadu : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభ నిర్వహించారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సనాతన ధర్మంపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని సనాతన ధర్మం గురించి కొంతమంది దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిది మారన్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.
సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ లాంటిదని ఉదయనిది స్టాలిన్ అనడంపై మండిపడ్డారు. సనాతన ధర్మంని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని దాని గురించి ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధమని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని అన్నారు. తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభ పెట్టారు. కాగా తిరుమల లడ్డు వివాదంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఆ తర్వాత సనాతన ధర్మం కాపాడుకోవాలని దాని గురించి సనాతన బోర్డు కావాలని ఆయన గట్టిగా పట్టుబడుతున్నారు.
దేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి హిందువు పాటుపడాలని కోరుతున్నారు. కాగా సనాతన ధర్మం గురించి విమర్శించేవారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని చెబుతున్నారు. తాను ఏ మతానికి వ్యతిరేకం కాదని కానీ సనాతన ధర్మంపై విషం చిమ్ము తున్న వారిపై పోరాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు. కాగా ఈ వ్యాఖ్యలపై తమిళనాడులోని ఒక అడ్వకేట్ పవన్ కళ్యాణ్ పై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఉదయనిది మారన్ పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ పై కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మతపరమైన అంశాలపై ఏపీ డిప్యూటీ సీఎం రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఏపీలో పవన్ కళ్యాణ్ తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.
వైసిపి ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగడుతున్నారు. అటు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రిగా తన బాధ్యత నిర్వర్తిస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉంటూ పోరాటాలు చేస్తున్నారు.