
PM Modi
PM Modi : అసలు బ్రాండ్ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుందో తనకు తెలియదని పీఎం మోది అన్నారు. సోమవారం ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు బ్రాండ్ అంటే ఏమిటో తనకైతే తెలియదని, ప్రజలు మాత్రం తన జీవితాన్ని, పనితీరును చూస్తున్నారని తెలిపారు.
తాను 13 సంవత్సరాలు గుజరాత్ సీఎంగా ఉన్నానని.. పదేళ్లుగా ప్రధానిగా ఉంటున్నానని పేర్కొన్నారు. కానీ 100 ఏళ్లకు పైగా జీవించిన తన తల్లి చివరి రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారన్నారు. తన తల్లి సాధారణ జీవితం గడిపిందన్నారు. అలాంటప్పుడు దేశానికి బ్రాండ్ అవసరం లేదన్నారు. తన జీవితం కొంతవరకు భిన్నంగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చునన్నారు.
తాను సీఎంగా ఉన్నప్పుడే తనకు 250కి పైగా దుస్తులు ఉన్నాయని మాజీ సీఎం అమర్ సింహ చౌదరి ఆరోపించారని, తనపై చేసిన ఆ ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. రూ.250 కోట్లు దోచుకునే సీఎం కావాలా? 250 జతల దుస్తులు ఉన్న ముఖ్యమంత్రి కావాలా? అని తాను ప్రజల ముందుకు వెళ్లానని తెలిపారు.