JAISW News Telugu

Rashmika Mandanna : ఏంట్రా మనం ఒకటే ఫ్యామిలీ.. ఇలా అడిగితే ఎలా రష్మిక మందన్నా

Rashmika Mandanna

Anand Devarakonda-Rashmika Mandanna

Rashmika Mandanna : రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని ఎప్పటి నుంచో ఇండస్ట్రీ కోడై కూస్తోంది. ఇదంతా నిజం కాదని కొంతమంది, కాదు వీరిద్దరూ పీకల్లోతూ ప్రేమలో మునిగి పోయారని మరి కొందరు అనుకుంటున్నారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమా గం గం గణేశా ఫ్రీ రీలిజ్ ఈవెంట్ కు రష్మిక మందన్నా హాజరైంది. 

ఈవెంట్ జరుగుతుండగా నీ ఫేవరేట్ యాక్టర్ ఎవరని రష్మికను ఆనంద్ దేవరకొండ అడిగాడు. దీంతో మైక్ ను కాసేపు పక్కన పెట్టిన రష్మిక నీ యబ్బా అని తర్వాత నువ్వు నా ఫ్యామిలీరా.. ఆనంద్ ఇలాంటి ప్రశ్నలు అడగొచ్చా అంటూ కౌంటర్ ఇచ్చింది. రష్మిక ఇలాంటి వ్యాఖ్యలు చేయగానే ఆ ఈవెంట్ కు వచ్చిన ఎంతో మంది ఫ్యాన్స్ విజయ్ విజయ్ అంటూ అరుస్తూ రచ్చ చేశారు. 

విజయ్ దేవరకొండ రష్మిక కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ మూవీస్ లో  నటించారు. దీంతో వారి మధ్య ప్రేమ చిగురించిందని ఇద్దరూ కలిసి చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. అయితే విజయ్ తమ్ముడు ఆనంద్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రష్మిక రావడంపై అందరి అనుమానాలు మరింత బలపడ్డాయి. 

ఈవెంట్ లో ఆనంద్ ప్రశ్న అడగడం.. దీనికి రష్మిక కూడా మనం ఒకే ఫ్యామిలీ మెంబర్ అని చెప్పడం చూస్తుంటే వీరు అప్పుడే కలిసిపోయారని తెలుస్తోంది. ఇక వీరిద్దరూ కెరీర్లో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయం కూడా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.  రష్మిక ఒకే ఫ్యామిలీ అని అనడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో నెట్టింట తీవ్ర చర్చ నడుస్తోంది. కొంతమంది నెటిజన్లు మరిదిని బాగానే ఆటపట్టిస్తున్నావ్ .. రౌడీ బాయ్ విజయ్ కు తెలిస్తే ఊరుకుంటాడా అంటూ వరుస కలిపి మరీ కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version