Sabhapati : మంత్రులే ఆలస్యంగా వస్తే ఎలా..?: సభాపతి అయ్యన్నపాత్రుడు

Sabhapati
Sabhapati : ప్రశ్నోత్తరాల సమయాన్ని మంత్రులు సీరియస్ గా తీసుకోవాలని సభాపతి అయ్యన్నపాత్రుడు సూచించారు. మంత్రులే సభకు ఆలస్యంగా వస్తే ఎలా? సరైన సమయంలో రావడానికి ప్రయత్నించండని చెప్పారు. తణుకులో ఈఎస్ఐ ఆసుపత్రిపై అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చే సమయంలో మంత్రి సుభాష్ అందుబాటులో లేకపోవడంపై ఆయన ఇలా స్పందించారు. డిస్కంల కొనుగోళ్లలో అక్రమాలపై అడిగిన ప్రశ్నను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. కడపలో తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి ప్రశ్న వేశారు. ఆమె విప్ గా ఉండడంతో ప్రశ్న అడిగేందుకు నిబంధనలు అంగీకరించవని అయ్యన్నపాత్రుడు వివరించారు.