Heroine : ఒకప్పటి హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి? 

Heroine

Heroine Gayathri Raghuram

heroine Changed : తెలుగు సినీ రంగంలో ఒక్క సినిమాతోనే పాపులర్ అయి ఆ తర్వాత కనుమరుగై పోయిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. అలాంటి కోవకే చెందుతుంది పై ఫొటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ. తన అమాయకత్వపు నటనతో తెలుగులో చేసిన ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకులను గుర్తు పెట్టుకునేలా చేసింది.

 తెలుగులో ఆఫర్స్ కొట్టేసి స్టార్ హీరోయిన్ గా నిలిచిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ తెలుగులో సరైన అవకాశాలు రాక.. కోలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయింది. కోలీవుడ్ లో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ తెలుగులో మాత్రం రాలేవు.

ఇంతకీ ఈ ముద్దుగుమ్మ పేరు చెప్పలేదు కదూ.. ఆమెనే గాయత్రి రఘురామ్. తెలుగులో 2003 లో వచ్చిన మా బాపు బొమ్మకు పెళ్లంట చిత్రంలో హీరోయిన్ గా చేసింది. ఈ మూవీలోని మాటలే రాని వేళ అనే సాంగ్ ఇప్పటికీ అందరి నోళ్లలో నానుతోంది. గాయత్రి రఘురామ్ తెలుగులో రేపల్లెలో రాధ అనే మూవీతో వెండితెర కు పరిచమైంది. 2001 లో ఈ సినిమా రిలీజ్ కాగా.. 2003 లో వచ్చిన బాపు బొమ్మకు పెళ్లంట లో కూడ యాక్ట్ చేసింది.

ఏమైందో తెలియదు కానీ అవకాశాలు రాకపోగా.. పక్కకు వెళ్లిపోయింది. తెలుగు, తమిళంతోపాటు మలయాళంలో కూడా యాక్ట్ చేసి తన సత్తా ఏంటో నిరూపించుకుంది.  తెలుగులో 2004 నుంచి 2010 వరకు ఈ ముద్దుగమ్మ ఒక్క సినిమా కూడా చేయలేదు.  హీరోయిన్ ఆఫర్స్ తగ్గడంతో సహాయ పాత్రల్లో  నటించింది. స్వయంగా గాయత్రి రఘురామ్ కొరియోగ్రాఫర్  2006లో యూఎస్ లోని  కాలిఫోర్నియాలోని చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీ ఇంజనీర్ దీపక్ చంద్రశేఖర్ ను పెళ్లి చేసుకుంది. కాగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. 2010 నుంచి వీరు వేరు వేరుగానే ఉంటున్నారు. కాగా ఇప్పుడు ఆమె మారిపోయిన తీరు ను చూసి   సినీ ప్రేక్షకులు నోరెళ్ల బెడుతున్నారు.

TAGS