JAISW News Telugu

Bathroom : మెట్ల కింద బాత్ రూం నిర్మించుకుంటే ఏమవుతుందో తెలుసా?

Bathroom

Bathroom

Bathroom : మనం ఇల్లు కట్టుకునేటప్పుడు, కొనుక్కునేటప్పుడు వాస్తు పక్కాగా చూసుకుంటాం. లేదంటే కొనుగోలు చేయడానికి ఇష్టపడం. ఇంట్లో వాస్తు ప్రకారం అన్ని ఉండకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తరువాత కూడా వాస్తు దోషాలు ఉన్నాయని తెలిస్తే మళ్లీ ఇంటిని నిర్మించుకునేందుకు కూడా వెనకాడం. అందుకే అంత్యనిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలన్నట్లు ముందస్తు చర్యల్లో భాగంగానే వాస్తు ప్రకారం చూసుకుని కట్టుకునేందుకు మొగ్గు చూపుతాం.

ఇంటికి మెట్లు కూడా అత్యంత ప్రాధాన్యం ఉండేవే. చాలా మంది మెట్లను పెద్దగా పట్టించుకోరు. కానీ మెట్లతో కూడా మనకు వాస్తు సమస్యలు ఉంటాయి. కొందరు మెట్ల కింద బాత్ రూం నిర్మించుకుంటారు. ఇది కరెక్టు కాదు. మెట్ల కింద బాత్ రూం ఉంటే సమస్యలు కొని తెచ్చుకున్నట్లే. అందుకే మెట్ల కింద ఏం ఉంచకుండా జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది.

కొందరైతే మెట్ల కింద పూజ గది కానీ స్టోర్ రూం కానీ ఏర్పాటు చేసుకుంటారు. ఇది కూడా మంచిది కాదు. మెట్ల కింద చెప్పులు ఏర్పాటు చేసుకునే స్టాండ్ కూడా పెడుతుంటారు. ఇది కూడా శ్రేయస్కరం కాదు. మెట్ల కింద సాధ్యమైనంత వరకు ఖాళీగానే ఉంచుకోవడం మేలు. మెట్ల కింద ఎలాంటి వస్తువులు పెట్టుకోకపోవడమే బెటర్ అని తెలుసుకోవాలి.

మెట్ల నిర్మాణం బేసి సంఖ్యలో ఉండాలి. రెండు వైపుల రెయిలింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇలా మెట్లను ఖాళీగా ఉంచుకుంటేనే మనకు లాభాలుంటాయి. పైకప్పు మీద మట్టి పాత్ర పెట్టి అందులో నీళ్లు పోసి అవి పక్షలు తాగేలా చూసుకుంటే మన ఇంటికి ఏవైనా వాస్తు దోషాలు ఉన్నా దూరం అవుతాయి. మెట్లు నిర్మించేటప్పుడు ఒక మట్టి పాత్రలో నీళ్లు పోసి దాన్ని పాతిపెడితే కూడా మంచి ఫలితాలు వస్తాయి.

Exit mobile version