JAISW News Telugu

Shubman-Shreyas : యువరక్తం ఏమైపోయింది..? ఆ ఇద్దరిని ఎందుకు సెలక్ట్ చేశారు..ఫ్యాన్స్ ఆగ్రహం

Shubman Gill-Shreyas Iyer

Shubman Gill-Shreyas Iyer test match

Shubman Gill-Shreyas Iyer : హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఓడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో గిల్, శ్రేయస్ అయ్యర్ లపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు చివరి 11 టెస్ట్ ఇన్నింగ్స్ లలో ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.

పూజారే, రహానే వద్దంటే వద్దు..అని, వారి ఏజ్ అయిపోతోందని వారిలో ఇంకా ఆడే సత్తా ఉన్నప్పటికీ పక్కకు పెట్టేశారు. టీమిండియా ఫ్యూచర్  దృష్ట్యా ఇలా చేశామని చెప్పేశారు. వెటరన్ ప్లేయర్ల ప్లేసులో యువకులు నిండిపోవడంతో ఫ్యాన్స్ కూడా మురిసిపోయారు. సీన్ కట్ చేస్తే యువరక్తం కాస్త తేలిపోయింది. ఆడాలన్నా కసి, గెలవాలన్న సంకల్పం గిల్, శ్రేయస్ లో అస్సలు కనిపించలేదు. మరో సచిన్, మరో కోహ్లీ అంటూ క్రికెట్ కెరీర్ ఆరంభంలో గిల్ హైప్ తెచ్చుకున్నాడు.

ఇక శ్రేయస్ అయ్యర్ కు బిల్డప్ ఎక్కువ ఆట తక్కువ అన్నట్టు తయారయ్యాడు. అతనెంటో అతడి ఆట ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అయినా ఈ ఇద్దరినే ఆడిస్తోంది బీసీసీఐ.

వీరిద్దరి స్కోర్ చూస్తే వారి ఆట ఎలా ఉందో మీకే అర్థమవుతుంది. శ్రేయస్ లాస్ట్ 11 ఇన్నింగ్స్ ల్లో 4,12,0,26,0,31,0,4,31,0..ఇలా ఉంది. ఆఫ్రిదికి తమ్ముడిలా ఆడుతున్నాడు. నాలుగు గుండుసున్నాలు ఉన్నాయి. ఒక్క హాఫ్ సెంచరీ లేదు. ఇక అతడి బాడీ లాంగ్వేజ్ చూస్తే అసలు ఆడాలన్న ఇంట్రెస్ట్ ఉన్నట్టే కనిపించదు. అవుటైతే కనీసం బాధ కూడా ఉండదు.

ఇక శుభమన్ గిల్ చివరి 11 ఇన్నింగ్స్ లను చూస్తే..13,18,6,10,29,2,26,10,36,23,0..ఇలా ఉన్నాయి. వన్డేలు, ట్వంటీల్లో బాగానే ఆడుతున్నా గిల్ టెస్టుల్లో మాత్రం అట్టర్ ప్లాప్ అవుతున్నాడు. ఎంతో టాలెంట్ ఉన్నా, ఇలా ఆడడంపై ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. ఇన నిన్నటి టెస్ట్ పరాజయంలో ఈ ఇద్దరిదే కీలకపాత్ర. దీంతో వీళ్లను ఎందుకు సెలక్ట్ చేశారు ద్రావిడ్ సార్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version