Deputy CM Pawan : ఐదేళ్లలో కేంద్రం విడుదల చేసిన నిధులు ఏమయ్యాయి?: డిప్యూటీ సీఎం పవన్

Deputy CM Pawan
Deputy CM Pawan : స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉన్నతాధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు. కార్పొరేషన్ పనితీరుపై డిప్యూటీ సీఎంకు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్రకు నిధుల లభ్యత, ఖర్చుల వివరాలపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు. గత ఐదేళ్లలో కేంద్ర విడుదల చేసిన రూ.1,066 కోట్లు ఏమయ్యాయని అధికారులను ప్రశ్నించారు. కేంద్ర నిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కు విడుదల చేయలేదని అధికారులు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖలపై గురువారం డిప్యూటీ సీఎం సమీక్ష చేస్తారని సమాచారం.